కరీంనగర్

అన్నదాతలను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, మార్చి 21: చివరి ప్రాంత పంటలకు సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోయాయని, ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పంటలను పరిశీలించి ఎకరానికి పది వేలు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరి మహేందర్ డిమాండ్ చేశారు. మండలంలోని సుగ్లాంపల్లి గ్రామంలో మంగళవారం పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటి అధ్యక్షుడిగా పాపాని లక్ష్మినారాయణ, ఉపాధ్యక్షుడిగా కంకటి శంకర్, ప్రధాన కార్యదర్శిగా చొప్పరి శ్రీనివాస్, కార్యనిర్వహణ కార్యదర్శిగా చిట్టవేని లచ్చయ్య, కార్యదర్శిగా అడిచెర్ల సదయ్య, బొడ్డు మల్లయ్య, కోశాధికారిగా వసంత, కార్యవర్గ సభ్యులుగా కనుకుల కిరణ్, మిట్టపల్లి రాంనారాయణ, బత్తిని రాజేశం యాదవ్, పోసాని ఐలయ్య, పెంట అంజయ్య, కందునూరి సురేష్‌లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లోని చివరి గ్రామాలకు కాలువ నీరందక రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు పన్నాల రాములు, అమిరిశెట్టి రాజలింగం, వెగోళం అబ్బయ్య గౌడ్, కుమార్ కిషోర్‌తో పాటు పలువురు ఉన్నారు.