కరీంనగర్

అవినీతిని పూర్తిగా నిర్మూలించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మార్చి 23: రాష్ట్రం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో జైళ్లలో అవినీతిని పూర్తిగా నిర్మూలించామని జైళ్ల శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ వినయ్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం రామగుండం ఎన్టీపీసీలోని మిలినీయం హాల్‌లో జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. జైళ్లలో క్యాంటీన్, లైబ్రరరీ లాంటి వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఖైదీలల్లో సత్పవర్తకై అనేక కార్యక్రమాలను చేపడుతూ వారిలో మార్పును తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆరో గ్యం, మేధాశక్తి పెంపుకోసం యోగా శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. వారిలో మంచి ఆలోచనలు రేకెత్తించి సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడే విధంగా వారిని తీర్చిదిద్ధుతున్నామని అన్నారు. జైళ్ల కోసం రెండు సంవత్సరాల కాలంలో ఎలాంటి ప్రత్యేక నిధులు కాని, సిబ్బందిని కాని పెంచకుండా ఈ మార్పు తీసుకురావడం మాకు గర్వకారణంగా ఉందన్నారు.
సమాజం పట్ల
బాధ్యతగా వ్యవహరించాలి
ప్రతీ ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే సమాజంలో మార్పు తీసుకురావచ్చని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అన్నారు. గురువారం ఎన్టీపీసీ మిలినీయం హాల్‌లో స్వచ్ఛం ద సేవా సంఘాల నిర్వాహకులతో ఆ యన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన వారు సమయం వృథా చేయకుండా సమాజ మార్పు కోసం పాటుపడాలని కోరారు.
సమావేశంలో తహశీల్దార్ గుడూరి శ్రీనివాసరావు, జిల్లా జైల్ సూపరింటెండెంట్ శివ కుమార్, స్వచ్ఛంద సేవా సంఘాల నిర్వాహకులు డాక్టర్ పెంట రాజేష్, ఈదునూరి శంకర్, మంద నాగరాజుతోపాటు పాల్గొన్నారు.