కరీంనగర్

కల సాకారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 24: ఎన్నో యేళ్ల నిరీక్షణకు తెర పడబోతోంది. రెండు దశాబ్దాలకుపైగా ఎదురుచూస్తున్న నాలుగు జిల్లాల ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు సాకారం కాబోతోంది. పెద్దపల్లి-నిజామాబాద్ (ఇందూర్) రైలు నేడు పట్టాలపై పరుగులు పెట్టనుంది. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు మార్గంపై కోటి ఆశలు పెట్టుకున్న పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల ప్రజ ల ఆశలు నెరవేరబోతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏడో నిజాం 1946లో ఈ రైలు మార్గానికి ఆమోదముద్ర వేసినా పనులకు మోక్షం లభించలేదు. 1992లో కరీంనగర్ జిల్లాకు చెందిన అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు స్వయం గా పెద్దపల్లి-నిజామాబాద్ (ఇందూర్) రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు. 1993 సంవత్సరంలో ఈ మార్గానికి రూ.925 కోట్లతో పరిపాలన అనుమతులు లభించగా, అప్పటి నుంచి సరి గా నిధులు కేటాయింపులు లేకపోవడంతో ఈ మార్గం పనులు అటకెక్కా యి. 2004-05 నుంచి కేంద్ర బడ్జెట్‌లో ఈ మార్గానికి నిధుల కేటాయింపులు ఉండటంతో పనులకు నోచుకుంది. మొదటగా 2004-05లో రూ. 22.84 కోట్లు కేటాయించారు. 2004- 05 నుంచి 2017-18 వరకు ఒక మాదిరిగానే నిధుల కేటాయింపులు ఉండటంతో ఎట్టకేలకు పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు రైల్వేమార్గం పూర్తయింది. 2014లో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం టిఆర్‌ఎస్ ఎంపిలు బాల్క సుమన్, బోయినపల్లి వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవితలు ఈ రైలుమార్గం కోసం నిధుల కేటాయింపుపై పలుమార్లు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన సంగతి తెలిసిం దే. దీంతో కేంద్రం నిధులు కేటాయించడంతో పనుల్లో పురోగతి పెరిగింది. నిన్నటివరకు పెద్దపల్లి నుంచి మోర్తాడ్ వరకు కొనసాగిన ఈ రైలు నేడు నిజామాబాద్ వరకు నడవనుంది. ఈ మా ర్గానికి రూ.925కోట్లు అంచనా వేయ గా, పనుల జాప్యం కారణంగా ఆ అంచనా రూ.1500 కోట్లకు చేరింది. ఈ మార్గం మొత్తం 178 కిలోమీటర్లు కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 122 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లా లో 56 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గం ద్వారా పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు మేలు కలగనుండగా, రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. మొత్తానికి కేంద్ర రైల్వేమంత్రి పెద్దపల్లి- నిజామాబాద్ రైలుకు నేడు పచ్చజెండా ఊపి ప్రారంభించనుండగా, దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న నాలుగు జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. దీంతో ఆయా జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.