కరీంనగర్

పర్యాటక కేంద్రంగా కరీంనగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 26: అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారనుందని కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు భద్రత పట్ల భరోసా కల్పించడంలో కరీంనగర్ పోలీసులు సఫలీకృతులవుతున్నారని పేర్కొన్నారు. కమ్యూనిటి సిసి కెమెరాల ప్రాజెక్టులో భాగంగా ఆదివారం నగరంలోని డాక్టర్స్ స్ట్రీట్‌లో డాక్టర్లు అందజేసిన 36 లక్షల రూపాయల విరాళాలతో ఏర్పాటు చేసిన 43 సిసి కెమెరాలను ఎంపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిసి కెమెరాల ద్వారా నేరాలను సులువుగా చేదించే అవకాశం ఉందని అన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, మరిన్ని ముఖ్య కూడళ్లలో కూడా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. స్మార్ట్ సిటీకి ఎంపికైన కరీంనగర్‌ను రూ.1000 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ స్మార్ట్ అండ్ సేఫ్ సిటీలో భాగంగా కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో భద్రతపై భరోసాను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజాజీవనంలో సిసి కెమెరాల పాత్ర కీలకమైందన్నారు. సిపి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ పది వేల సిసి కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తమకు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరా వు, మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటి మేయర్ గుగ్గిళ్లపు రమేష్, స్థానిక కార్పొరేటర్ రాజకుమారి, మున్సిపల్ కమిషనర్ శశాంక, ఎసిపి రామారావు, జడ్పీటిసి ఎడ్ల శ్రీనివాస్, ఎంపిపి వాసా ల రమేష్, డాక్టర్లు భాగ్యారెడ్డి, శ్రీనివాస్, భూంరెడ్డి, పలువురు డాక్టర్లు, కార్పొరేటర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
సిపిఎస్ విధానాన్ని
రద్దు చేయాలి
* డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రవౌళి
* మానకొండూర్‌లో యూనియన్ మండల సమావేశం
మానకొండూర్, మార్చి 26: కంట్రీబ్యాటరీ పెన్షన్ పథ కం(సిపిఎస్) విధానాన్ని రద్దుచేయాలని డెమాక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డిటిఎఫ్) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోహెడ చంద్రవౌళి ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మోర్సీ భవనంలో డిటిఎఫ్ మండల సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన చంద్రవౌళి మాట్లాడుతూ 2004, సెప్టెంబర్ మాసం తర్వాత ప్రభుత్వా ఉద్యోగంలో నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూ తన పెన్ష్‌న్ విధానం జీవితాల్లో అంధకారాన్ని నింపిందన్నారు. ఉద్యోగి మరణిస్తే ప్రతినేల వృద్ధులకు ఇచ్చే వృద్ధాప య పింఛన్ కంటే తక్కువ వస్తుందన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కోనసాగించాలని డిమాండ్ చేశారు. తర్వాత పలు విషయాలపై మాట్లాడారు.అనంతరం మండల డిటీఎఫ్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు( వేగురుపల్లి), ఉపాధ్యక్షులుగా పి. రమేష్, జ్యోతి, సతీష్, ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి, నూతన కార్యవర్గం ఎన్నుకున్నట్లు తెలిపారు. డిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు వై. ఉమారాణి, రాంమోహన్, వెంకట్రాములు, తదితరులు పాల్గొన్నారు.