కరీంనగర్

వారసత్వం సాధన కోసం నిరవధిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మార్చి 27: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సాధన కో సం ఐక్యంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిలో భాగంగానే ఏప్రిల్ 17 నుంచి సింగరేణి వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. వారసత్వ ఉద్యోగాల సాధనలో తెలంగాణ ప్రభుత్వం, టిబిజికె ఎస్ పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. ఈ మేరకు సోమవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎ ఐటియుసి నుంచి గట్టయ్య, ఐ ఎన్‌టియుసి నుంచి జనక్ ప్రసాద్, హెచ్ ఎం ఎస్ నుంచి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాల సాధనకు సంబంధించి సింగరేణిలో తలపెట్టిన నిరవధిక సమ్మె కోసం ఈ నెల 31న సింగరేణి సిఅండ్ ఎం డికి, ఆర్‌ఎల్‌సికి జాతీయ సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వనున్నామని చెప్పారు. వారసత్వ ఉద్యోగాలను సాధించే వరకు జాతీయ కార్మిక సంఘాలు ఊరుకునే ప్రసక్తే లేదని, ఎంతటి ఆందోళన చేయడానికైనా జాతీయ కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత వారసత్వ ఉద్యోగాలను అమలు చేస్తామని, మొదటి సంతకం ఇదే చేస్తామని పదే పదే ప్రగల్భాలు పలికిన వారసత్వాన్ని అమలు చేయలేకపోయిందని కార్మిక సంఘాల నేతలు తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాలుగేళ్ల పాటు గుర్తింపు సంఘంగా ఉన్న గని కార్మికులకు ఏ మాత్రం మేలు చేయలేకపోయిందని, పైగా కార్మికులకు జరిగిన మేలంతా మేమే చేసిన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటుందని, టిబిజికె ఎస్ కాలపరిమితంతా అంతర్గత వివాదాలతోనే సరిపోయిందని వ్యంగ్యంగా విమర్శించారు. సమావేశంలో బిఎంఎస్ నేతలు పెద్దపల్లి గట్టయ్య, బూర్ల లక్ష్మీనారాయణ, సిఐటియు నేతలు నర్సింగ రావు, మొగిలితోపాటు తదితరులు పాల్గొన్నారు.
తీపి కబురు
* విద్యార్థులకు
హాస్టల్ మెస్ చార్జీల పెంపు
* అసెంబ్లీలో సిఎం ప్రకటన
* పలు విద్యార్థి సంఘాల హర్షం

కరీంనగర్, మార్చి 27: ఉగాది కానుకగా హాస్టల్ విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం తీపి కబురునందించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర శాసనసభలో సిఎం కెసిఆర్ మెస్ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని హాస్టళ్లల్లో కలిపి సుమారు 20వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. హాస్టల్ విద్యార్థులకు సంబంధించి మూ డునుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు రూ.750 చెల్లిస్తుండగా, దానిని రూ.950 వరకు పెం చారు. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రస్తుతం రూ.850 చెల్లిస్తుండగా, దానిని రూ. 1100ల వరకు పెంచారు. ఇంటర్ నుం చి డిగ్రీ విద్యార్థులకు ప్రస్తుతం నెలకు రూ.1050 చెల్లిస్తుండగా, దానిని రూ.1400 వరకు పెం చారు. అలాగే కాలేజి హాస్టళ్లకు సంబంధించి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు రూ.962 నుంచి రూ. 1500వరకు, పిజి విద్యార్థులకు రూ. 682 నుంచి రూ.1500 వరకు, డిగ్రీ విద్యార్థులకు రూ.520 నుంచి రూ. 1000 వరకు, ఇంటర్ విద్యార్థులకు రూ.520 నుంచి 750 వరకు పెంచారు. వీటితోపాటు స్టూ డెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్లు, డే స్కాలర్‌లకు సంబంధిం చి పిజి విద్యార్థులకు రూ.442 నుం చి రూ. 650 వరకు, డిగ్రీ విద్యార్థులకు రూ.325 నుంచి రూ.500 వర కు, ఇంటర్ విద్యార్థులకు రూ.325 నుంచి రూ.500 వరకు పెంచారు. రాష్ట్రంలో మొత్తం 18 లక్షల మంది విద్యార్థులుండగా, ఉమ్మడి జిల్లాలో సుమారు 20వేల మంది విద్యార్థులు ఉన్నారు. మెస్ చార్జీల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.117కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఇప్పటికే హాస్టళ్లకు సన్నబి య్యం పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభు త్వం తాజాగా మెస్‌చార్జీలను పెంచింది. కాగా, దీనిపై పలు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయ. టిఆర్‌ఎస్ విద్యార్థి విభా గం, జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కరీంనగర్‌లో సంబురాలు జరిగాయి. సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఏకగ్రీవంగా సిరిసిల్ల మున్సిపల్ బడ్జెట్ ఆమోదం
* రోడ్ల విస్తరణ, ఎంపి లాడ్స్ కేటాయింపుల్లో వివక్ష
* సమావేశంలో విపక్ష సభ్యుల ఆరోపణలు
సిరిసిల్ల, మార్చి 27: రోడ్ల విస్తరణ, ఎంపి లాడ్స్ మంజూరులో వివక్ష జరు గుతోందని సిరిసిల్ల మున్సిపల్ కౌన్సి ల్ సమావేశంలో విపక్ష సభ్యులు ఆరోపించారు. సోమవారం మున్సిపల్ 2017-18 సంవత్సరపు బడ్జెట్ ప్రత్యేక సమావేశం చైర్‌పర్సన్ సామల పావని అధ్యక్షతన జరిగింది. రూ.6611.57 లక్షలతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను స్వల్ప సవరణలతో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణగౌడ్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని, నిధుల కేటాయింపులో ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇపుడు స్వరాష్ట్ర పాలనలోనూ అన్యాయం జరుగుతున్నదన్నారు. పనుల్లో నెంబర్ వన్‌గా నిలిచాడని చెబుతున్న ఎంపి సిరిసిల్ల మున్సిపాలిటీకి గత మూడేళ్ళుగా ఎలాంటి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. సిరిసిల్లపై చిన్న చూపు, నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మున్సిపల్‌లో అధికార తెరా స సభ్యుల బలం ఉన్నా ఎందుకు దీని పై దృష్టిసారించడం లేదని, ఎంపిని ఎందుకు నిధులు కోరడం లేదని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎంపిని కనీసం ఏటా రూ.50 లక్షల నిధులైనా కోరాలని సూచించా రు. ఫంక్షన్ హాల్సుపై ఆదాయం లేదని చూపుతున్నారని, వీటి నుండి ఆదా యం రాబట్టడానికి చొరవ చూపడం లేదన్నారు. అలాగే రోడ్ల విస్తరణలో కరీంనగర్-కామారెడ్డి రోడ్డును వంద అడుగులకు, సిరిసిల్ల-సిద్దిపేట రోడ్డుకు 80 అడుగులకే నిర్ణయించడం వల్ల వివక్ష కనిపిస్తున్నదని, దీని పట్ల ప్రజల నుండి విమర్శలు ఎదురవుతున్నాయని విపక్ష సభ్యులు బుర్ర నారాయణగౌడ్, మడుపు శ్రీదేవి, ఎర్రం వెంకట్రాజంలు అన్నారు. ఇప్పటికైనా కెకె రోడ్డును కనీసం 90 అడుగులకు కుదించాలని, లేని పక్షంలో సిద్దిపేట రోడ్డును కూడా వంద అడుగులకు చేయాలని ప్రజలు అంటున్నారన్నారు. తాము ప్రజల పక్షాన ఉన్నందున వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని రోడ్ల విస్తరణలో ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. పనుల నిర్మాణాల్లో కాంట్రాక్టర్ల నుండి 140 వరకు ఇఎండి డిడిలు మున్సిపల్‌లో జమ కాలేదని తెలిసిందని, కొందరు ఇచ్చిన డిడిలు వెనక్కు తీసుకున్నట్టు తెలిసిందని దీనిపై స్పష్టత నివ్వాలని సభ్యులు కోరారు. రోడ్ల విస్తరణలో మాస్టర్‌ప్లాన్ ప్రకారం, గతంలో చేసిన తీర్మానం ప్రకారమే చేస్తున్నామని చైర్‌పర్సన్ పావని అన్నా రు. గతంలో సిరిసిల్లను జిల్లా కావాలని పోరాటం చేశారని, జిల్లా అయ్యాక రోడ్ల అభివృద్ది చేయరాదంటే ఎలా అంటూ, జిల్లా కేంద్రం అయినందున టాఫిక్ పెరిగిందని, రోడ్ల విస్తరణ జరగాలని తెరాస సభ్యు లు యెల్లె లక్ష్మినారాయణ, గుండ్లపెల్లి పూర్ణచందర్‌లు అన్నారు. ఇది రోడ్ల విస్తరణ కాదని, మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామని, అయితే గతంలో గ్రామపంచాయతి, మున్సిపల్ నుండి వేర్వేరుగా అనుమతులున్నాయని, అయితే ప్రజలు ఎవరు కూడా కోర్టు వరకు వెల్లకుండా వారితో సంప్రదింపులు చేస్తూ వారి మనోభావాలను గుర్తిస్తూ వారు సంతృప్తి చెందేలా చేసి రోడ్లపై ఉన్న కట్టడాలను తొలగించుకునేలా చూస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు వెల్లడించారు. అలాగే తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు వంద అడుగులు విడిచి ప్రహరీలు నిర్మిస్తామని, తర్వాతే పాత ప్రహరీలు కూల్చి వేస్తామని, ఇందు కోసం న్యాయమూర్తి కూడా సలహా ఇచ్చారని, ఇది ప్రజలకు స్ఫూర్తిదాయకుండా ఉంటుందన్నారు. ఈ ప్రహరీల నిర్మాణానికి రూ.70 లక్షలతో ప్రదిపాదనలు చేశామని కమిషనర్ వెల్లడించారు. కాగా నష్టపోతున్న ఇళ్ళకు పరిహారం ఇవ్వాలని తమ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్టు, ఇందుకు అసవరమైన నిధులను కూడా ఈ బడ్జెట్‌లో పెట్టాలని బిజెపి ఫ్లోర్‌లీడర్ ఎర్రం వెంకట్రాజం కోరారు. ఎంపి నిధులు ఇవ్వకపోవడం నిర్లక్ష్యమేనని అన్నారు. మంత్రి ఇచ్చిన రూ.13 కోట్ల స్పెషల్ ఫండ్ నిధులు మినహా మరేమీ రాలేదని, వీటిని రెండేళ్ళుగా పనులు ఇంకా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
పోచమ్మ గుడి స్థల వివాదంపై
ఎసిపి విచారణ
ముత్తారం, మార్చి 27: రచ్చకెక్కిన కేశనపల్లి పోచమ్మ గుడి స్థల వివాదంపై గోదావరిఖని ఎఎస్‌పి అపూర్వరావు సోమవారం గ్రామస్థులతో కలిసి విచారణ చేపట్టారు.
గత మూడు నెలల క్రితం గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుమేరకు మంథని సిఐ ప్రభాకర్ అదే గ్రామానికి చెందిన కందునూరి ఓదెలు, పాశం భూమయ్య, బక్కతట్ల కుమార్‌లను విచారణ పేరుతో పిలిపించి చితకబాదాడు. సర్వే నం.4750 లో గల భూ వివాదంపై ఎవరు గొడవపడవద్దని ప్రభుత్వ అధికారిచే సర్వే జరిపేంతవరకు గ్రామస్థులు గొడవలకు పోవద్దని ఎసిపి సూచించారు. అయితే గ్రామానికి చెందిన వీరు ఉన్నతాధికారులకు దీనిపై ఫిర్యాదు చేయగా ఎసిపి అపూర్వరావు విచారణ చేపట్టారు. ఎసిపి వెంట ముత్తారం ఎస్‌ఐ సుంచు రమేష్ ఉన్నారు.