కరీంనగర్

బాలికా విద్యకు భరోసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 3: బాలికల విద్యను ప్రోత్సహించాలనే సదాశయంతో కొనసాగిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇక నుంచి ఇంటర్ విద్యను బోధించనున్నారు. చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థినులకు పదో తరగతి వరకే పరిమితం కాకుండా ఉండేందుకు, బాలిక విద్యకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా ఆరు నుంచి పదవ తరగతి వరకే పరిమితమైన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం (2017-18) నుంచే ఇంటర్ వరకు స్థాయి పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు ఈ మేరకు సన్నాహాలు కూడా చేస్తోంది. దీంతో పదవ తరగతి అనంతరం ఇంటికే పరిమితమవుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది వరంగా మారనుండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 59 కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న 5 వేలకుపైగా విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి వరకే పాఠశాలలుండగా, బాలికలను ఇతర ప్రాంతాలకు పంపలేక, ఆర్థిక వనరుల ఇబ్బందులతో మధ్యలోనే చదువులు మానేసి, డ్రాపౌట్లుగా మారుతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం డ్రాపౌట్స్‌ను అరికట్టి బాలికల్లో చదువుతోపాటు నైపుణ్య విద్యను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు గత కొనే్నళ్ళుగా కొనసాగుతున్నాయి. అయితే, వీటిలో కూడా పదో తరగతి వరకే బాలికలు చదువుకునేందుకు అవకాశముండగా, అనంతరం అధిక శాతం విద్యార్థినులు తిరిగి ఇళ్ళకే పరిమితమవుతున్నారు. చదవాలనే ఆకాంక్ష వారిలో బలీయంగా ఉన్నా, పరిస్థితుల ప్రభావంతో కళాశాల విద్య వారికి అందని ద్రాక్షగానే మారుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గతేడాది తన నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో కస్తూర్బా పాఠశాలను పరిశీలించగా, కొంతమంది బాలికలు ఉన్నత విద్య తమకు అందని కారణాలు వెల్లడించారు. దీంతో స్పందించిన సిఎం దీనిపై కేంద్రానికి లేఖ రాయగా, కళాశాల స్థాయికి వీటిని అప్‌గ్రేడ్ చేసేందుకు అనుమతిచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల స్థాయికి పెంచాలంటూ ఆదేశాలు జారీచేయడంతో, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అమలు పరిచేందుకు కసరత్తు మొదలైంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా, ఎస్సెస్సీ పరీక్షలు ఇటీవలే ముగియటం, ఫలితాల విడుదలకు మరికొద్దిరోజుల గడువు ఉండగా, కస్తూర్బాల్లో కళాశాల తరగతి గదుల ఏర్పాటుపై సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాల విద్యా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పదవ తరగతి ఫలితాల అనంతరం స్థాయి పెంపు ప్రకటన వెలువడనుండగా, ఉన్నత చదువులపై మమకారం ఉన్న నిరుపేద, అనాధ విద్యార్థినులకు ఆశాకిరణంలా కస్తూర్బాలు మారబోతుండడం గమనార్హం.

కెసిఆర్ చొరవతోనే కులవృత్తులకు రక్షణ
సిరిసిల్ల, ఏప్రిల్ 3: కుల వృత్తుల రక్షణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నడుం బిగించి, అన్ని సామాజిక వర్గాలకు అండగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల సహకార అభివృద్ది సమాఖ్య చైర్మన్ కన్ననబోయిన రాజన్న యాదవ్ అన్నారు. సోమవారం సిరిసిల్ల వాసవి కళ్యాణ మండపంలో జరిగిన తెలంగాణ ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా రాజన్న యాదవ్ పాల్గొనగా, పట్టణ అధ్యక్షులు జెగ్గాని మల్లేశం యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాఖ్య చైర్మన్ కనె్నబోయిన రాజన్న యాదవ్ మాట్లాడుతూ యాదవులకు 75 శాతం సబ్సిడీ వర్తింప చేసిన ఘనత కెసిఆర్‌దేనని అన్నారు. ఈనెల 23న జరిగే జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరుగుతాయని, ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, యాదవ సోదరులు పాల్గొనాలని సూచించారు.
కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు బొబ్బల మల్లేశ్‌యాదవ్, ప్రచార కార్యదర్శి మందాడి రాజలింగం యాదవ్, నాయకుల వీరవేని మల్లేశం, సింగిల్ విండో వైస్ చైర్మన్ మిరాల భాస్కర్‌రెడ్డి, సిరిసిల్ల మండల అధ్యక్షులు గొట్ల ఐలయ్య, బండి దేవేందర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఓదెలు యాదవ్, వేములవాడ రాజన్న యాదవ్, ఒగ్గు నర్సయ్య, బండ నర్సయ్య, కొక్కు దేవేందర్, పలుమారు మల్లేశం, బర్కం నవీన్, బండారి రమేశ్, కాల్వ నర్సయ్య, అన్ని గ్రామాల మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

రిజర్వాయర్ నిర్మాణంలో చేతివాటం
గంభీరావుపేట, ఏప్రిల్ 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఎగువమానేరు ఎత్తిపోతల రిజర్వాయర్ నిర్మాణంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. డబ్బుల్వినిదే ఫైల్ ముందుకు కదలడంలేదని ఎమ్మార్పీఎస్ నాయకుడు మంగళి చంద్రవౌళి ఆధ్వర్యంలో కొంత మంది సోమవారం తహసీల్దార్ ఎదుట గగ్గోలు పెట్టారు. సాక్ష్యాధారాలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. ప్రాణహీత-చేవేళ్ల ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజీ కింద నిర్మించతలపెట్టిన ఎగువ మానేరు ఎత్తిపోతల పథకంలో భాగంగా మండల పరిధిలోని ముస్త్ఫానగర్ శివారులో గల ముంపు రైతులకు నష్టపరిహారం అందించేందుకు గాను రైతుల వివరాలను అందచేయాలని కోరడంతో, ఇదే అదనుగా భావించిన రెవెన్యూ అధికారులు బినామీలను సృష్టించి అందిన కాడికి దండుకుంటున్నట్లుగా ఎమ్మార్పీఎస్ నాయకులు తహసీల్దార్ సమక్షంలో ఆరోపించారు. స్థానిక విఆర్వో భూనిర్వాసితులకు సమగ్ర నివేదిక ఇవ్వక జిల్లా అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా వాపోయారు. కొంత మంది మద్యవర్తుల ద్వారా విఆర్వో తతంగం నడిపిస్తున్నారని ఆరోపించారు. ముంపు బాధితులు భయటకు చెప్పుకోలేక మింగలేక అడిగినంత ముడుపులు అందచేస్తున్నారని తహసీల్దార్ దృష్టికి తీసుకేళ్లారు. కార్యక్రమంలో ముస్త్ఫానగర్ ఉపసర్పంచ్ అనంత రాజయ్య, నాయకులు బరిగెల అభిలాష్, బాల్‌రాజు, కూడెల్లి కాశయ్య, లక్ష్మీ, బండ రాజయ్య, రాజలింగం, సూర మేట్టవ్వ, నర్సింహులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న పౌరాణిక నాటకం
ధర్మపురి, ఏప్రిల్ 3: శ్రీలక్ష్మీ నాట్యమండలి (అశీతి) 80వసంతాల మహోత్సవం సందర్భంగా నాట్యమండలి, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా దేవస్థానంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సోమవారం రాత్రి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి నాట్య మండలి వారిచే ప్రదర్శించబడిన శ్రీకృష్ణ రాయబారం, పాండవ సం దేశం పౌరాణిక సాంప్రదాయక పద్య నాటకం ఆకట్టుకుంది. విశ్రాంత ప్రాచార్యులు సంగనభట్ల నర్సయ్య దర్శకత్వంలో విశ్రాంత పండితులు కాకెర్ల దత్తాత్రేయ శర్మ నిర్వహణలో సమర్పించిన, సంగీతరత్న కొరిడె నరహరి శర్మ శ్రీకృష్ణునిగా, ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ సంగనభట్ల కిషన్ కురు సార్వభౌమునిగా, భీమునిగా, విశ్రాంత అధికారి కాకెర్ల దత్తాత్రేయ శర్మ ధర్మజునిగా, పాలెపు చంద్రవౌళి శర్మ పాం డవ మధ్యమునిగా, కాకెర్ల అనిల్ కు మార్ నకులునిగా, కాకెర్ల అమర్ సహదేవువునిగా, ద్రౌపదిగా కాకెరి అరుణ, నటునిగా ఒజ్జల పుల్లయ్య శాస్ర్తీ, వైవి ధ్య భరిత రాగాలతో, హావభావాలతో, సాటిరాని నటనతో ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల గావించిం ది. తెలంగాణలోనే మొట్టమొదటి నాటకసంస్థయై, పౌరాణిక నాటకాలకు పె ట్టింది పేరుగా నిలిచియున్న ధర్మపురి నాట్య మండలి సాంప్రదాయక పద్య నాటకం పాతతరం నటుల ప్రదర్శనలను మరోమారు జ్ఞప్తికి తెచ్చింది. హైదరాబాద్ పరమేశ్వర్ డ్రెసెస్ వారి సెట్టింగులు, మేకప్ ప్రశాంసాపాత్రమైంది. నాటకాన్ని చూసిన పాతతరం నటులు, నాట్యమండలి రథసారథులై న విశ్వనాథ శాస్ర్తీ ఆదులు యువ నటు ల నటనా కౌశలాన్ని వేనోళ్ల పొగిడారు. దేవస్థానం ఇఓ సుప్రియ, కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సభ్యులు లింగన్న, నటరాజ్, సునీల్, రాజన్న, కార్యక్రమంలో కళాకారులను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.
మధు మృతిపై విచారణ
* అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతం డిమాండ్
పెద్దపల్లి, ఏప్రిల్ 3: అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడనే నేపంతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని, వెంటనే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, రీ పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. సొమవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని ఐబి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనగారిన కులాలకు రక్షణ కరువైందని తక్షణమే ప్రభుత్వం చొరువ తీసుకొని రక్షణ కల్పించాలన్నారు. దళితులపై హత్యలు, దాడులు పెచ్చుమీరాయని మీము దంచుడు మొదలు పెడితే చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సుద్దాల లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి బొంకూరి సురెందర్ (సన్నీ), తాళ్లపల్లి అంజయ్య, కుక్క మల్లయ్య, రవి, అజయ్, మహేష్, అంజయ్య, మోహన్‌బాబు, జయదేవ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్‌లో..
మానకొండూర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానపూర్‌కు చెం దిన మధుకర్ మృతిపై వెంటనే సిట్టింగ్ జడ్జీతో విచారణ చెపట్టాలని మానకొండూర్ అంబేద్కర్ విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశారు. సోమవా రం మానకొండూర్ కేంద్రంలోని డా క్టర్‌బిఅర్ అంబేద్కర్ విగ్రహాన్ని గట్టుదుద్దనపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ప్రవీణ్ తొగాడియాకు ఘనస్వాగతం
- గోదావరిఖనిలో విహెచ్‌పి, భజరంగ్‌దళ్ భారీ ప్రదర్శన
గోదావరిఖని, ఏప్రిల్ 3: గోదావరిఖని పట్టణంలోని శారదనగర్ ఏరియా లో నిర్మించిన విశ్వహిందూ పరిషత్ స్వర్ణజయంతి మందిర్‌ను విహెచ్‌పి అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా సోమవారం సాయంత్రం ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహించారు. అంతకు ముందు విహెచ్‌పి అంతర్జాతీయ కార్య నిర్వహక అధ్యక్షులు ప్రవీణ్ భాయ్ తోగాడియా మొదటి సారిగా గోదావరిఖనికి విచ్చేసిన సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రామగుండం బిపవర్ హౌస్ గడ్డ వద్ద వేలాది మంది విహెచ్‌పి కార్యకర్తలు ప్రవీణ్ భాయ్ తోగాడియాకు పూలమాలలు వేసి ఘనంగా ఆహ్వానించారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో స్వాగతించారు. రామగుండం నుంచి ఎన్టీపీసీ, ఎఫ్‌సి ఐ కార్నర్ మీదుగా గోదావరిఖని పట్టణం వరకు వందలాది బైక్‌లతో ర్యాలీ కొనసాగింది. పట్టణంలోని పుర వీధుల గుండా బైక్ ర్యాలీ చేపట్టి స్వర్ణ జయంతి మందిరం వరకు చేరుకుంది.
కార్యక్రమంలో నేతలు వేపూరి రాములు గౌడ్, క్యాస శ్రీనివాస్, అయోధ్య రవి, ఈ సంపల్లి వెంకన్న, బల్మూరి అమరేందర్ రావు, కౌశిక హరి, బల్మూరి వనిత, శ్రీ్ధర్, రావుల రాజేందర్, సుల్వ లక్ష్మీనర్సయ్య, నాగభూషణం, వేలాది మంది కార్యకర్తలు, తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా ఆసుపత్రిలో పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం
ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 3: వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రి (ఐసియు)లో పొరుగు సేవల పద్ధతిన (ఔట్ సోర్సింగ్) ద్వారా దిగువ తెలిపిన పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. స్ట్ఫానర్సు ఖాళీలు 6, నెలసరి పారితోషికం 20 వేలు, అర్హతలు డిప్లమా ఇన్ జిఎన్‌ఎం/బిఎస్సీ నర్సింగ్ కలిగి ఉండాలని, ల్యాబ్‌టెక్నీషియన్ ఖాలీ 1, నెలసరి పారితోషికం 15 వేలు, అర్హత డిప్లమా ఇన్ మెడికల్ ల్యాబరేటరీ, రేడియాలజీ టెక్నీషియన్ ఖాళీ 1, నెలసరి పారితోషికం 15 వేలు, అర్హత డిప్లమా ఇన్ రేడియోగ్రాఫర్, వెంటిలేటర్ టెక్నీషియన్ పోస్టు 1, పారితోషికం 15 వేలు, అర్హతలు ఇంటర్‌తో డిప్లమా ఇన్ వెంటిలేటర్ కోర్సు కలిగి ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులు 12.4.2017 సాయంత్రం 5 గంటల వరకు జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రి కరీంనగర్‌లో సమర్పించాల్సిందిగా పేర్కొన్నారు.

డిఐజికి శుభాకాంక్షలు
ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 3: కరీంనగర్ రేంజ్ డిఐజి సిఐ రవివర్మను పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు సోమవా రం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిఐజి కమిషనరేట్ పరిధిలో సంఘం గురించి, సం ఘం చేపడుతున్న సం క్షేమ కార్యక్రమాల గురించి సంఘం ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్, కార్యదర్శి తుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు సిహెచ్. సాగర్ పాల్గొన్నారు.
మద్దతు ధర కల్పించడంలో సర్కార్ విఫలం
టిడిపి జిల్లా కన్వీనర్ సత్యనారాయణ

కరీంనగర్, ఏప్రిల్ 3: రైతులు పండించిన పంటలకు కనీస మద్ధతు ధర కల్పించడంలో టిఆర్‌ఎస్ ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. మిర్చి, కంది, పసుపు, తదితర వాణిజ్య పంటలకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నాయకులు రొడ్డ శ్రీనివాస్, చెల్లోజు రాజు, నాగుల బాలాగౌడ్, ఔదుర్తి విజయ కుమార్, హయగ్రీవచారి, గాజె రమేష్‌లతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.
లారీ యజమానుల
సమస్యలు తీర్చాలి
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 3: తెలంగాణ లారీ యాజమాన్య సంఘం ఆ ధ్వర్యంలో కొనసాగుతున్న లారీల నిరవధిక బంద్‌కు టిడిపి జిల్లా కన్వీనర్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. నగరంలోని బైపాస్‌లో గల లారీ యజమానుల సంఘం కార్యాలయం వద్ద కొనసాగిస్తున్న దీక్షా శిబిరాన్ని సోమవారం సందర్శించి మద్దతు తెలిపారు.

విఐపి సిఫారసు లేఖలపై స్పందించండి

కరీంనగర్, ఏప్రిల్ 3: విఐపిలు సిఫారస్ చేసిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అ హ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జా యింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, డిఆర్‌ఓ ఆయేషా మస్రత్ ఖానమ్, ఆర్‌డిఓ రాజాగౌడ్, డిఆర్‌డిఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలి
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 3: ఇల్లందకుంటలో జరుగు సీతారామచంద్రుల కల్యాణమునకు ఆహ్వానపత్రికను కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో దేవాలయ చైర్మన్ కె.సురేందర్ రెడ్డి, ఆలయ ఇఓ సులోచన కలెక్టర్‌ను కల్యాణంకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.
కార్యక్రమంలో జెసి బద్రి శ్రీనివాస్, డిఆర్‌ఓ ఆయేషా మస్రత్ ఖానమ్, ఆర్‌డిఓ రాజాగౌడ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఐఎస్‌ఎల్ నిర్మాణాలపై దృష్టిపెట్టండి
జిల్లాలోని అన్నిగ్రామాలలో మం జూరైన వ్యక్తిగత మరుగుదొడ్లను (ఐఎస్‌ఎల్) వందశాతం నిర్మాణాలు పను లు వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఎంపిడిఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో ఎంపిడిఓలు, తహశీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎస్‌ఎల్ నిర్మాణాలకు నిధుల కొరత లేదని, ఐఎస్‌ఎల్ లబ్ధిదారులను ప్రోత్సహించి త్వరగా నిర్మించుకొనేలా కృషి చేయాలని అన్నారు. ఐఎస్‌ఎల్ నిర్మించుకొవటము వలన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, సీజనల్ వ్యాధులు ధరిచేరవని తెలిపారు. జెసి శ్రీనివాస్, సిఇఓ జిల్లా పరిషత్ ఆర్‌డిఓలు కరీంనగర్ రాజాగౌడ్, హుజూరాబాద్ చిన్నయ్య, జిల్లా పం చాయతీ అధికారి, డిఆర్‌డిఓ, జిల్లా వై ద్య ఆరోగ్యశాఖాధికారి, సిపిఓ, ఎంపిడిఓలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.