కరీంనగర్

మత రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 16: ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపిన రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆమోదముద్ర వేయించుకునే యత్నం చేస్తుందని, దీనిని ప్రతిఒక్కరూ ప్రతిఘటించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ముస్లీం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ రాష్టశ్రాఖ ఇచ్చిన పిలుపుమేరకు నగరంలోని అంబేద్కర్ చౌక్‌లో ఆదివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచటాన్ని తమ పార్టీ సమర్థిస్తుందని, అయితే ఇదేస్థాయిలో ముస్లీంలకు 12శాతం కోటా అమలును మాత్రం వ్యతిరేస్తున్నట్లు స్పష్టంచేశారు. తమపార్టీ ఎస్టీ రిజర్వేషన్ బిల్లును సమర్ధిస్తున్నా, వ్యతిరేకిస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ టిఆర్‌ఎస్ నేతలు బుర ద చల్లేయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కిరాయి ఆందోళనలతో నీచ రా జకీయాలకు పాల్పడుతున్న టిఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మతపరమైన రిజర్వేషన్లపై రాష్ట్ర ఉభయసభల్లో ఆమోదించే ఆదివారాన్ని బ్లాక్‌డేగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ముస్లీంలను బిసిలలో కలుపుతూ వారి పొట్టగొట్టే యత్నం చేస్తుండగా, మరోవైపు మతపరమైన రాజ్యాం గ వ్యతిరేక బిల్లును, రాజ్యాంగబద్దమై న ఎస్టీ రిజర్వేషన్ బిల్లుతో కలిపి, ఉమ్మడిగా ప్రవేశపెట్టి గిరిజనులను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన సిఎంకు మైనార్టీ పిచ్చిపట్టిందని దుమ్మెత్తారు. రాష్ట్రం లో 12శాతం ఉన్న ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తే, 80 శాతం ఉన్న హిందువులకు ఏమేరకు రిజర్వేషన్లు అమలుచేస్తారో ప్రకటించాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో నిర్భం ద పాలన కొనసాగిస్తూ, ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపుతున్న బిజెపి, బిజెవైఎం, ఎబివిపి విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయించటం ఆయన దుర్మార్గాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. ఇతర హిందూ సంస్థల కార్యకర్తలను అర్ధరాత్రి నుంచే అక్రమంగా అరెస్టులు చేయటం అమానుషమన్నారు. బిసిలను కేవలం కులవృత్తులకే పరిమితం చేస్తూ, రాజకీయంగా, విద్య, ఉద్యోగపరంగా అణిచివేసే కుట్రలకు పాల్పడుతున్నాడన్నారు. ముందస్తు అరెస్టుల నుంచి తప్పించుకున్న బిజెపి కార్యకర్తలు ఆపార్టీ నేత బండి సంజయ్ నేతృత్వంలో వందలసంఖ్యలోనల్లజెండాలు పట్టి, ఎస్సారార్ కళాశాల నుంచి కోర్టు చౌ రస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించే యత్నం చేయగా, వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెల్పుతున్న తమ ను బలవంతంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీసుల తీరుపై కార్యకర్త లు మండిపడుతూ వారితో వాగ్వాదానికి దిగారు. కోర్టు చౌరస్తాలో బైఠాయించి, రాస్తారోకో చేపట్టారు. దీంతో అర్ధగంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం కలుగడంతో వందల సంఖ్య లో వాహనాలు నిలిచిపోయాయి. మూ డోపట్టణ సిఐ మహేశ్ వారికి సర్ధిచెప్పటంతోగొడవ సద్దుమణిగింది. బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బి.ప్రవీన్‌రావు, నాయకులు కచ్చురవి, రామరాజు, తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్, కిరన్, రమణారెడ్డి, నాగసముద్రం ప్రవీన్, పొన్నం మొండయ్య, బండ రమణారెడ్డి, తాడూరి బ్రహ్మం, ముప్పిడి సునీల్‌తో పాటు 150 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.