కరీంనగర్

బిసిలంతా ఏకం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, ఏప్రిల్ 16: రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బిసి రిజర్వేషన్ల పరిరక్షణ కోసం బిసిలంతా ఏకమై పోరాటాలు చేయాలని, పార్టీకతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని బిజేపి నేత దుగ్గ్యాల ప్రదీప్‌కుమార్ పిలుపు నిచ్చారు. జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్‌లో బిసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బిసిల రిజర్వేషన్ కోటాను పెంచకుండానే అదనంగా మరికొంత మంది రిజర్వేషన్ల పేరుతో బిసిల్లో చేర్చడం అన్యాయమన్నా రు. ఎక్కువా ఉన్నా బిసి జనాభా దమాషా ప్రకారం అవసరమయ్యే రిజర్వేషన్ వాటా శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేముల రాంమూర్తి, మధుసూదన్, బొడ్డుపల్లి సంపత్, అశోక్, శిలారపు పర్వతాలు, గోపి, తిరుపతి, వంశీ, బెజ్జెంకి దిలిప్‌కుమార్, తంగెడ రాజేశ్వర్‌రావు, రాజారాంసింగ్, మహంత క్రిష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు.

జనహిత సభ ఏర్పాట్లు పరిశీలించిన కవిత
జగిత్యాల, ఏప్రిల్ 16: జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ఎత్తున నిర్వహిస్తున్న జనహిత ప్రగతి సభ ఏర్పాట్లను ఆదివారం రాత్రి 8:30గంటలకు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపి కవిత నియోజక వర్గ ఇంచార్జ్ డాక్టర్ సంజయ్‌కుమార్, జిల్లా ఎస్పీ అనంతశర్మకు పలు సూచనలు చేసారు. సభ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పరిశీలించి లోపాలను రేపటి సభ సమయం లోగా సరి చేయాలని ఎంపి సూచించారు.
డిమాండ్ చేశారు.
పట్టు వస్త్రాల సమర్పణ
ధర్మపురి, ఏప్రిల్ 16: ధర్మపురి క్షేత్రంలోని గోదావరీ తీరస్థ మహాలక్ష్మి దేవికి జన్మదిన సందర్భంగా, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆదివారం ఉదయం దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీ.అ.అలువాల శ్రీనివాస్, జూ.అ. గోపాల్‌రావు, లక్ష్మీకాంతన్న, అర్చకులు నేరేళ్ళ వంశీకృష్ణ, అర్చక పురోహితులు బొజ్జా సంతోష్‌శర్మ తోడురాగా, అర్చకులు పట్టు వస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ముందు నడవగా మహాలక్ష్మి ఆలయం వరకు మంగళ వాద్యాలతో ఊరేగి దేవికి కానుకలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు.