కరీంనగర్

బండెనక..బండి కట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 27: సైకిల్ నుంచి బైక్ వరకు .. ఎడ్ల బండి నుంచి ఆటో వరకు.. టాటా ఎసి నుంచి కారు వరకు ..ట్రాక్టర్ నుంచి డిసిఎం వరకు..స్కూల్ బస్సుల నుంచి ఆర్టీసీ బస్సు వరకు ఇలా అన్ని రకాల వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఓరుగల్లు బాట పట్టాయి. టిఆర్‌ఎస్ 16వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లాలో నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ భారీ బహిరంగ సభకు గురువారం ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు ఉమ్మడి జిల్లా నుంచి 3లక్షల పైచిలుకు జనం వందలాది వాహనాల్లో వరంగల్‌కు తరలివెళ్లారు. కరీంనగర్ నుంచి లక్షా 50వేలు, హుజూరాబాద్ నుంచి 50 వేలు, పెద్దపల్లి జిల్లా నుంచి 40 వేలు, సిరిసిల్ల జిల్లా నుంచి 40 వేలు, జగిత్యాల జిల్లా నుంచి 40 వేల చొప్పున పార్టీ శ్రేణులు, ప్రజలు పార్టీ ముఖ్య నాయకత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో తరలివెళ్లారు. 1000 ఆర్టీసి బస్సులు, 400 ప్రైవేటు బస్సులు, 1500 విద్యా సంస్థల బస్సులు, 3000 ట్రాక్టర్లతోపాటు డిసిఎంలు, అప్పీ ఆ టోలు, టాటాఎసి వాహనాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు సైకిళ్లు, ఎడ్ల బండ్లు ఏర్పాటు చేశారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లకు గులాబీ కాగితాలతో నింపి, మామిడాకులు, కొబ్బరిమట్టలతో అం దంగా ముస్తాబు చేసుకుని ఇరువైపుల సిఎం కెసిఆర్ చిత్రపటాలను పెట్టుకుని మరీ వరంగల్‌కు తరలివెళ్లారు. అలాగే డిజె సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఆటాపాటలతో వాహనాల ర్యా లీ సందడిగా కొనసాగింది. బహిరంగ సభ సమయానికల్లా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, హసన్‌పర్తి మీదుగా ఉమ్మడి జిల్లా వాహనాలతోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా ల నుంచి వచ్చిన వాహనాలు కూడా ఇదే రహదారి మీదుగా వెళ్లాయి. దీంతో ఈ రహదారిపై వాహనాల మో తలు మోగగా, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ యంత్రాం గం అన్ని చర్యలు చేపట్టింది. వరంగల్ సభను సక్సెస్ చేసేందుకు పక్షం రోజుల పాటు వార్డుమెంబర్ నుంచి మంత్రి వరకు, గ్రామ కమిటి నుంచి రాష్ట్ర కమిటి వరకు ప్రతినిధులందరు జన సమీకరణ కోసం శ్రమించిన సంగతి అందరికి తెలిసిందే. కరీంనగర్ నగరం నుంచి వరంగల్ సభ ప్రాంగణం వరకు సైకిల్ యాత్ర చేపట్టిన గులాబీ శ్రేణుల సైకిల్ యాత్రను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అమరవీరుల స్థూపం వద్ద జెండా ఊ పి ప్రారంభించారు. అలాగే ఎడ్ల బండ్లతోపాటు వాహనాలకు జెండా ఊపా రు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రైతులాగా దోతి ధరించి ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు. అలాగే ఉమ్మడి జిల్లా నుంచి ఆయా ఎమ్మెల్యేల సారథ్యంలో వారివారి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు సభకు తరలివెళ్లారు. మొత్తానికి పార్టీ నాయకత్వం అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువగా సభకు ఉమ్మడి జిల్లా నుంచి జాతరలా జనం తరలివెళ్లారు.