కరీంనగర్

న్యాయం కోసం యువతి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, ఏప్రిల్ 28: జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన దుద్దెల సుమలత అనే యువ తి వివాహం నిశ్చయం కాగా అదే గ్రామానికి చెందిన తాటిగంటి చందు అనే యువకుడు, పెండ్లి ఖాయం చేసుకున్న ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన పెండ్లి కొడుకుకు ఫోన్ చేసి యువతిని నేను ప్రేమిస్తున్నానని, నువ్వు పెండ్లి చేసుకోవద్దని ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, ఈ సంఘటనపై ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసును పక్కదారి పట్టించేందుకు పాల్పడుతున్నారని, విలాసాగర్ గ్రామంలో పెండ్లి చెడగొట్టిన యువకుని ఇంటి ఎదుట టెంట్ వేసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా, జమ్మికుంట సిఐ ప్రశాంత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని, బాధితురాలు సుమలత, కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో చర్చించి యువతికి న్యాయం చేస్తానని హామీతో ఆందోళన విరమింప జేశారు. శుక్రవారం యువతి వైపు గ్రామస్థులు మూడు ట్రాక్టర్లలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పెండ్లి చెడగొట్టిన యువకున్ని అదుపులోకి తీసుకొని, గ్రామస్థుల ఎదుట కౌన్సిలింగ్ నిర్వహించారు. సిఐ ప్రశాంత్‌రెడ్డి యువతి, యువకునితో మాట్లాడగా పోలీసుల ఎదుట మాట మార్చి ఆ యువకుడు పెండ్లి చేసుకోను అంటూ సమాధానం చెప్పాడు. దీంతో పోలీసులు ఇద్దరితో మరోసారి మట్లాడుతామని, సమయం కావాలని తెలిపినట్లు గ్రామస్థులు తెలిపారు. ఒకే సామాజిక వర్గం, ఇద్దరు విద్యావంతులు, ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువతీ, యువకులు కావడంతో పెండ్లి చెడగొట్టిన యువకునితో పెండ్లి జరిపించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య అస్థి అంతస్థుల తేడాలు ఉన్నాయని, కొందరు ఫైరవీకారులు డబ్బుల కోసం సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలో నిజం లేకపోలేదు. పోలీసుల తీరుతో మొదటి నుండి గ్రామస్థులు నమ్మకం కలగడం లేదని, న్యాయం జరిగేవరకు ఆందోళనలు చేస్తామని యువతి, గ్రామస్థులు, మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నారు. నాయ్యం కోసం ఎక్కడికైనా వెళ్ళెందుకు సిద్దమని, యువతి ఆవేదనతో మాట్లాడారు.
రాజకీయ నాయకులు అండదండలతో పెండ్లి చెడగొట్టిన యువకుడిని తప్పించేందుకు పోలీసులు సహకరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి
* కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి
ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 28: నేరాల ఛేదనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా నేరాలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. శుక్రవారం కమిషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేశ్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో క్రైం బృందాలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు క్రమశిక్షణతో మెదులుతూ అంకితభావంతో పనిచేయాలని, త ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. అంకితభావంతో పనిచేయడం వల్లనే ఈ మధ్యకాలంలో కరుడుగట్టిన నేరస్థులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. సమావేశంలో ట్రైనీ ఐపిఎస్ అధికారి డాక్టర్ సంగ్రాం సింగ్ జి .పాటిల్, ఎసిపిలు జె.రామారావు, వి.తిరుపతితో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.