కరీంనగర్

వాటర్ హబ్‌గా కరీంనగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 28: మెట్టప్రాంతం అధికంగా ఉన్నా, పలు ప్రాజెక్టుల నిర్మాణాలతో సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న కరీంనగర్ జిల్లా త్వరలోనే వాటర్ హబ్‌గా విలసిల్లబోతుందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలోమాట్లాడుతూ ఉమ్మడి పాలనలో ఏ ప్రభుత్వమూ చేయలేని సాహసాన్ని తాము చేసి, ఎస్సారెస్సీ ఆయకట్టు పరిధిలో 9.40లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్టు వెల్లడించారు. గత పాలకులు ఏనాడూ 2లక్షల ఎకరాలకు మించి నీరివ్వలేదని, ఉమ్మడి జిల్లాపరిధిలోని మేడిగడ్డ ప్రాజెక్టు పూరె్తైతే ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ద్వారా ప్రతి ఎకరాకు నీరందించి, జిల్లాను సశ్యశ్యామలంగా మార్చుతామని, దీంతోతెలంగాణకే కరీంనగర్ ధాన్యాగారంగా మారుతుందన్నారు. ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో,ప్రధాన కాల్వల సామర్ధ్యం పెంచేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రిటైర్డు ఇంజనీర్లతోప్రత్యేకంగా కమిటీ నియమించి, కాలువల ఆధునీకరణపై పరిశీలనలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి ము ఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఆమోదం తెల్పారన్నారు. జిల్లాలోని మెట్టప్రాంతాలైన చిగురుమామిడి, సైదాపూర్, తిమ్మాపూర్ మండలాలకు వరదకాలువ నీటిని గ్రావిటీ ద్వారా తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లుస్పష్టంచేశారు. ఆంధ్రాలోని ఉభయగోదావరి జిల్లాలను తలదన్నిన కరీంనగర్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు సిఎం కెసిఆర్ దృఢనిశ్చయంతో ఉన్నారని అన్నారు. కొత్తరాష్ట్ర అభివృద్దికోసం తమ ప్రభుత్వం అహోరాత్రులు కృషిచేస్తుంటే, నూకలు చెల్లిన ప్రతిపక్షాలు అర్దంలేని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. మూడేళ్ళ పాలనలో తాము చేసిన అభివృద్ధి పనులకు గురువారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ అద్దం పట్టిందని, ఊహించని రీతిలో రైతులు కదలివచ్చి తమకు బహిరంగ మద్దతు ప్రకటించటంతోపాలుపోని ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయని విమర్శించారు. తమపార్టీ వార్షికోత్సవ సభకు ఇతర పార్టీల మాదిరి చందాలు వసూలు చేయలేదని, కార్యకర్తలతోకలిసి తాము కూలీ పనులు చేసి సంపాదించిన సొమ్ముతోసభ నిర్వహించామన్నారు. నిరాధార ఆరోపణలు చేసి, ప్రజల్లో పలుచన కావద్దని పరోక్షంగా కాంగ్రెస్, టిడిపిలకు హితువు పలికారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన లక్షలాది మంది ప్రజలు తమ పాలనపై విశ్వాసాన్ని ఉంచారని, వారి ఆశీర్వాదాలతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మున్ముందు కూడా పాల న సాగిస్తామని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్, కార్పోరేటర్లు వై.సునీల్‌రావు, వేణు, శ్రీకాంత్, నాయకులు ఎడ్ల అశోక్, చల్లా హరిశంకర్, తదితరులు పాల్గొన్నారు.