కరీంనగర్

నిమిషం ఆలస్యమైనా అనుమతించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మే 15: ఈనెల 18న ఎంబిఎ, ఎంసిఎ ప్రవేశాల కోరకు నిర్వహిస్తున్న ఐసెట్ పరీక్షకు ఒక్క నిమిషం అలస్యమైన అనుమతి ఇవ్వమని ఐసెట్ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. కిషన్ అన్నారు. సోమవారం ఐసెట్ పరీక్ష నిర్వహనపై అవగాహన సదస్సును నిర్వహించి అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై పలు సూచనలు చేసారు. అభ్యర్థులు కేవలం హల్‌టికెట్, అన్‌లైన్ అప్లికేషన్, ఫారం, పరీక్ష రాయడానికి అవసరమైన బ్లూ, బ్లాక్ పెన్, వాచీలు, సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువస్తే అనుమతి ఇవ్వమన్నారు. పరీక్ష సమయానికి పది గంటల తరువాత ఒక్క నిమిషం అలస్యమైన అనుమతి ఇవ్వమని అన్నారు. ఉదయం 8:30 నిమిషాలలోపే పరీక్ష కేంద్రానికి చేరుకుని బయోమెట్రిక్ హాజరివ్వాలన్నారు. బయోమెట్రిక్ హజరు తీసుకునే విధానంపై కళాశాల నుండి ఎంపిక చేసిన ఉద్యోగులకు శిక్షణ కూడ అందించారు. ఐసెట్ అధికారులు అశోక్, వాసవి, నరేష్ ఉన్నారు.
అక్రమాలకు పాల్పడితే చర్యలు
*ఉపాధి హామీ పిడి వెంకటేశ్వర్లు
మానకొండూర్, మే 15: మహాత్మగాంధీ ఉపాధి హామీ సామాజిక తనిఖీలో రూ. 20 లక్షల 69 వేలు దుర్వినియోగానికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్‌లపై చర్యలు తీసుకుంటామని పిడి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మానకొండూర్‌లోని ఎంపిడివో కార్యాలయంలో మహాత్మగాంధీ ఉపాధి హామీ 9వ విడత సామాజిక తనిఖి ప్రజావేదిక సమావేశం జరిగింది.
కార్యక్రమంలో ఎంపి పి లింగయ్య, జడ్పిటిసి సుగుణాకర్, ఎపిడి మంజుల దేవి, రాందాసు, రాజవౌళి, శ్రీనివాస్ మూర్తి, ఎపివో విజయ, తదితరులు పాల్గొన్నారు.
నియంతృత్వ పాలనకు
చరమగీతం పాడతారు

* టిడిపి రాష్ట్ర కార్యదర్శి సత్యం
గంగాధర, మే 15: రాష్ట్రంలో సాగుతున్న నియంతృత్వ పాలనకు రానున్న రోజుల్లో ప్రజలే చరమగీతం పాడుతారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు, పేద ప్రజల గొంతు నొక్కేందుకే ధర్నా చౌక్‌ను ముఖ్యమంత్రి తొలగించే ప్రయత్నం చేశారని, అందుకు గాను ఇందిరా పార్క్ వద్ద ప్రతిపక్షాలు, ప్రజలు చేపట్టిన ధర్నా చౌక్ కొనసాగించాలనే కార్యక్రమంలో టిఆర్‌ఎస్ గూండాలు, పోలీసులు దాడులు చేసిన సంఘటన నిదర్శనమన్నారు. స్థానికుల పేరిట టిఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులు మఫ్టిలో దుర్మార్గపు సంఘటనకు పాల్పడడం శోచనీయమన్నారు. లాఠీచార్జీలో గాయపడిన వారికి ప్రభుత్వం భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. సమావేశంలో బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు వైద భూపతి, మండల పార్టీ అధ్యక్షుడు మల్కపురం రాజేశం, బిసి సెల్ అధ్యక్షుడు వేముల ప్రసాద్, శ్రీపతి రావు, పానగంటి సత్యం, దొంతుల వేణు, పొన్నం తిరుపతి, రాములు, తదితరులు పాల్గొన్నారు.