కరీంనగర్

పవర్‌లూం కార్మికుల సమ్మె విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మే 15: ఎట్టకేలకు పవర్ లూం కార్మికుల సమ్మెకు సోమవారం తెరపడింది. గడిచిన ఎనిమిది రోజులుగా కూలి పెంపును కోరుతూ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. గత ఒప్పందాలను యజమానులు అమలు చేయడం లేదని, దానివల్ల తాము శ్రమ దోపిడీకి గురువుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని కార్మికు లు ఆరోపిస్తూ సమ్మెను చేపట్టారు. కార్మికుల సమ్మెతో నిత్యం సాంచెల (పవర్‌లూం) శబ్దంతో సందడి తావావరణంను తలపించే సిరిసిల్ల పట్టణం వారం రోజులుగా వౌన మే చిరునామాగా మారింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రాజీవ్ విద్యా మిషన్ దుస్తుల ఆర్డర్ ఇవ్వడం, కెసిఆర్ కిట్‌లో భాగం గా ఉండే చీర తదితర ఆర్డర్లు సైతం ఇవ్వడంతో ఈ సమ్మెతో సకాలంలో ఆర్డర్ సరఫరా సాధ్యమవుతుందా అని మీమాంస జిల్లా యంత్రాంగంను వెంటాడింది. కలెక్టర్ కృష్ణ్భాస్కర్ వెంటనే రంగంలోకి దిగి, సమ్మెకు తెరదించే నిమిత్తం యజమానులు, కార్మికులతో పలు దఫాలుగా ఉమ్మడిగా, విడివిడిగా చర్చలు జరిపారు. అయినా ఇరువర్గాలు మెట్టు దిగేందుకు నిరాకరించాయి. దీనితో కలెక్టర్ పవర్‌లూం వస్త్ర పరిశ్రమ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, మంత్రి కెటిఆర్ చొరవను ఇరు వర్గాలకు వివరించారు. సమ్మె వల్ల ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం వస్త్రాలు సకాలంలో అందించలేని పరిస్థితి ఉంటుందన్నారు. అలా జరిగితే భవిష్యత్తులో సిరిసిల్లకు రావాల్సిన మరిన్ని ఆర్డర్లు రాకుండా పోతాయని కలెక్టర్ కూలంకషంగా వివరించారు. వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి వెళ్ళే పరిస్థితి నెలకుంటుందని అన్నారు. దీని వల్ల ఇరు వర్గాలకు కోలుకోలేని నష్టం జరగడం తథ్యమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం పవర్‌లూం పరిశ్రమకు రాయితీలు అందించే అవకాశం ఉందని, యజమానులు, కార్మికులకు ఆమేరకు ప్రయోజనం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మాటలు ఇరు వర్గాలను ఆలోచింప చేశాయి. ఇరువురు ఒక్కో మెట్టు దిగేందుకు అంగీకరించారు. ప్రస్తుతం పవర్‌లూం కార్మికులకు ఒక మీటరు వస్త్రం ఉత్పత్తికి ఇస్తున్న రూ.85 పైసల స్థానంలో ఇక నుంచి రూపాయి ఐదు పైసలను(రూ..1.05) యజమానులు చెల్లించనున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి మరిన్ని ఆర్డర్లు వస్తే ఆ మేరకు కూలి రేట్లు పెంచేందుకు యజమానులు సుముఖత వ్యక్తం చేశారు. పెంచిన కూలి రేట్లను జూన్ 1, 2017 నుంచి అమలు చేస్తామని యజమానులు తెలిపారు. ఆ మేరకు సిరిసిల్ల పాలిస్టర్ క్లాత్ మాన్యుపాకచ్చరర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోవింద్ రవి, కార్యదర్శి మండల సత్యంలు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి కార్యక్రమంలో అంగీకార పత్రంను యజమానుల పక్షాన అందించారు. పవర్‌లూం యజమానులు కూలి పెంపు అంగీకార పత్రం కలెక్టర్‌కు ఇవ్వడంతో కార్మిక సంఘాల నేతలు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. కార్మికులు వెంటనే విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మూషం రమేశ్, శ్రీరాం సదానందం, ఒగ్గు గణేశ్, అన్నల్‌దాస్ గణేశ్‌లు మాట్లాడుతూ గత ఒప్పందాల ప్రకారం కూలి రేట్లు అమలు చేయకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు. కార్మికుల సమ్మెపై తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించిందన్నారు. ఎనిమిది రోజుల్లోనే కూలి రేట్లను పెంచేందుకు యజమానులను ఒప్పించి కార్మికుల సమ్మె విరిమించేలా చేయడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, మంత్రి కెటిఆర్, కలెక్టర్ కృష్ణ్భాస్కర్, జెసి యాస్మిన్ బాషా, డిఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, చేనేత జౌళి శాఖ ఎడి వి. అశోక్‌రావులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు కార్మికులు సమ్మెను విరిమించడం సంతోషమన్నారు. పవర్‌లూం వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కార్మికుల వరకు వెళ్ళేలా చేస్తామన్నారు. కూలి పంపునకు ముందుకు వచ్చిన యజమానులను కలెక్టర్ అభినందించారు.