కరీంనగర్

జగిత్యాల జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతుందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో జరిగిన భూ హక్కు పత్రాల పంపిణీ, జమీన్‌బందీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఎంపి కవిత భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్నపూర్ణగా జగిత్యాల జిల్లా నిలిచిందన్నారు. దీంతో పాటు పదవ తరగతి ఫలితాల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించి తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ముందంజలో ఉండడంతో పాటు భూ హక్కు పత్రాల పంపణీ తదితర సంక్షేమ పథకాల అమల్లో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానం నిలవడం అభినందనీయమని అన్నారు. జగిత్యాల జిల్లాలో 40లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని సేకరించి ఒక కోటి బస్తాలను తరలించడంలో అధికారుల కృషిని కొనియాడారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా తెల్ల కాగితంపై భూమి కొనుగోలు చేసిన ప్రతి రైతుకు భూ హక్కు పత్రాల పంపిణీ చేయడం, వాటికి సంబంధించిన ఐదు పత్రాలను అందచేయడం జరుగుతుందన్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ల పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల పథకాలతో ప్రతి ఇంటికి లబ్దిచేకూరేలా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని అదుకోవడానికి ఎకరానికి రూ. 8వేల రూపాయల పెట్టుబడితో పాటు 9 గంటల నాణ్యమైన విద్యుత్తు, సాగు నీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు. సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో సాగు, తాగునీటి కోసం రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ, గర్భిణులకు కెసిఆర్ కిట్, రూ.12 వేల నగదు ప్రోత్సహకాన్ని అందించడం జరుగుతుందన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీ్ధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్‌రావు, జడ్‌పిటిసి భూక్య సరళ, ఎంపిపి కొల్ముల శారధ, వైస్ కొండ్ర రాంచంద్రరెడ్డి, వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

సాగుభూమి లెక్కలు తీయాలి
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్

కరీంనగర్, జూన్ 16: రైతు సమగ్ర సర్వేలో భాగంగా రైతులు సాగు చేసే భూములను లెక్కలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో రైతు సమగ్ర సర్వేపై ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల వారీగా 1-బి ప్రకారం ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, అందులో సాగులో ఉన్న భూమి ఎంత, సాగులో లేని భూమి ఎంత అనే లెక్కలను పక్కాగా రైతుల వారీగా రికార్డులను నిర్వహించాలని సూచించారు. ప్రతీ రైతు వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. రైతులకు విత్తనాలు, ఎరువుల పెట్టుబడి కోసం ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుందని, ఇది రైతులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన వారందరికీ ఈ డబ్బులు అందేలా చూడాలని సూచించారు. మండలాల వారీగా ఎస్సీ,ఎస్టీ రైతుల జాబితాలను తయారు చేయాలని ఆదేశించారు. సర్వే పూర్తి కాగానే షాంపిల్‌గా ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని 4 నుంచి 5 గంటలు గ్రామంలో గ్రామసభ నిర్వహించి సర్వే సరిగా ఉందా, లేదా అనే దానిపై తనిఖీ చేయాలని కలెక్టర్లకు సూచించారు. 1-బిలో డబుల్ నెంబర్లు లేకుండా చూడాలని, అనవసరంగా ఉన్న నెంబర్లను తొలగించాలని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జెడి శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.

మిడ్ మానేరులోకి 10 టిఎంసిల నీరు
*నిర్వాసితుల సమస్యలపై స్పష్టతనిచ్చిన కలెక్టర్ కృష్ణ్భాస్కర్

సిరిసిల్ల, జూన్ 16: జూలై నెల చివరి వరకు మిడ్ మానేరు ప్రాజెక్టులో 10 టిఎంసి నీరు నింపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, నిజమైన నిర్వాసితులందరికీ పరిహారం అందించి న్యాయం చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో మిడ్ మానేరు నిర్వాసితులు, పరిహారం సమస్యలపై విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత నిచ్చారు. అయితే ఇంకా నిర్వాసితుల జాబితాలో ఎవరి పేరు తోలగిపోయి నా వారు గ్రామస్తులుగా నిర్ధారించే ఏదైనా ఒక్క డాక్యుమెంటు ఉన్నా చాలని, వారికి న్యాయం చేస్తామన్నారు. అంతే గానీ అవినీతి ఆరోపనలున్న త్రిసభ్య కమిటి సూచించిన మేరకు పరిహారం ఇవ్వడం కుదరని తేల్చి చెప్పారు. ముంపు గ్రామాలలో 30 వేల నిర్మాణాలుంటే 30 లక్షల నిర్మాణాలున్నట్టు త్రిసభ్య కమిటి నివేదించిందని, అక్రమాల మయంగా మారిన ఈ కమిటి మూడు వేల పర్సెంటీజీ ఎక్కువగా చూపడం అత్యంత దారుణమని కలెక్టర్ అన్నారు. అందు కే ఇందులో ఆరోపణలున్న 28 మంది ఇంజనీరింగ్ అధికారులపై ఈ కేసుల్లో బుక్కయ్యారని కలెక్టర్ వెల్లడించారు. ముంపు గ్రామాలలో నిజమైన పరిహారం కోసం డిమాండ్ చేయకుండా అవినీతి ఆరోపనలున్న త్రిసభ్య కమిటి నివేదిక ప్రకారం చెల్లింపులు చేయాలనడం సరికాదని, ఆ నివేదిక ప్రకారం ఇవ్వడం కుదరదని, దానికి చట్ట బద్దత లేదన్నారు. నిర్వాసితులకు నిజానికి మొదట చేసిన అంచనాల కంటే 30 శాతం కన్నా ఎక్కువే ఇచ్చామన్నారు. నిర్వాసితుల జాబితాలో నుండి మిస్సింగ్ అయిన వారుగా ఇంకా పుట్టుకొస్తున్నారని, అయితే వారు నిర్వాసితులైతే కనీసం ఓటరు కార్డు, ఆధార్, ఇతర ఏదైనా ఐటి, ప్రూఫ్ ఒక్కటి ఇచ్చినా వారికి న్యాయం చేస్తామన్నారు. మిస్సింగ్ పేర్ల జాబితా సమస్య జటిలంగా మారిందన్నారు. మిడ్ మానేరు పరిహారం చెల్లింపుల కోసం ప్రత్యేక హోదా ఉన్నదని, అందుకే వృద్దులు, జాబితాలో మిస్ అయిన వారు, కేటగిరీల మార్పు, ఆధారపడిన వారి కోసం ఇందులో ఆదుకునే అవకాశం ఉందన్నారు. మిస్సింగ్ అయిన వారి నుండి 2150 దరఖాస్తులు రాగా అందులో కేవలం 856 మంది మాత్రమే డాక్యుమెంట్లు సమర్పించారని, వారిని నిర్వాసితులుగా గుర్తించి, రూ.9.71 కోట్లు మంజూరు చేశామన్నారు. సరైన పత్రాలు ఇవ్వని వారికి మంజూరు చేయలేమన్నారు. తాజాగా మళ్ళీ మిస్సింగ్ ప్రక్రియ చేపట్టగా 875 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 294 మంది అర్హులుగా తేలారని కలెక్టర్ తెలిపారు. పరిహారం పెండింగ్ ఉన్న గ్రామాలలో వారం రోజుల్లో పరిహరం సమస్యలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా వెల్లడించారు. కొందరికి ఎక్కువ పరిహారం అంచనా వేశారని ఆరోపనలున్నందున వాటిని తిరిగి అంచనాలు వేయిస్తామన్నారు. ఆరెపల్లిలో 65 ఇళ్ళనున మాత్రమే ముంపులో తీసుకున్నామని, మొత్తం గ్రామం తీసుకోవడం వీలు కాదన్నారు. సంకెపల్లిలో 45 ఇళ్ళను ముంపులో తీసుకుంటున్నట్టు తెలిపారు. మాన్వాడ ప్రత్యేక ప్యాకేజి కోసం ప్రభుత్వానికి రాశామని, ప్రభుత్వం నుండి అనుమతి వస్తే పరిహారం ఇస్తామన్నారు. అందరికీ న్యాయం చేయడానికి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, నిజమైన నిర్వాసితులందరినీ ఆదుకోవాలన్నదే తమ ఉద్దేశ్యమని జెసి అన్నారు. డిఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై చివరి కల్లా పది టిఎంసి నీరు మిడ్ మానేరు రిజర్వాయర్ నిండుతుందని, గ్రామాలు మునగడం ఖాయమని స్పష్టం చేశారు. ముంపు గ్రామాలలో ఊరుకు ఇద్దరు ముగ్గురు దళారులు ఏర్పడి సమస్యలు సృష్టిస్తూ, ఎక్కువ పరిహారం వస్తుందని ఆశలు రేపుతూ నిర్వాసితులను మభ్య పెడుతూ తరచూ ధర్నాలు, ఆందోళనలతో సమస్యలు పెంచుతున్నారని అన్నారు. గ్రామాలలో ఇలాంటి వారిని గుర్తించామని, వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి రంగం సిద్దం అయిందన్నారు. దళారులను నమ్మకుండా నిర్వాసితులకు ఏదైనా సమస్యలుంటే నేరుగా తమ వద్దకు రావాలన్నారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని డి ఆర్వో స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జెసి, డిఆర్వోతో పాటు ఆర్డీవో పాండురంగ పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు చర్యలు

* రేయింబవళ్లు పెట్రోలింగ్ * ఉద్ధృతం శ కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి

కరీంనగర్, జూన్ 16: వివిధ రకాల నేరాల నియంత్రణకు చర్యలు తీసుకున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. నేరాల నియంత్రణకు రేయింబవళ్లు పెట్రోలింగ్ చర్యలను ఉదృతం చేయడంతో పాటు క్రైం బృందాలను అప్రమత్తం చేశామని చెప్పారు. శుక్రవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని దివంగత ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో క్రైం బృందాలతో సమీక్షాసమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దోపిడీ దొంగతనాలు జరిగే తీరు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్రైం బృందాలు అవగాహన కల్పించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే సమాచారం అందేలా ప్రజలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచించారు. పెండింగ్ కేసుల చేదన, దోపిడి దొంగల ముఠాలను పట్టుకోవడం, సదరు కేసుల్లో సమాచారం అందించే వారికి రూ.50 వేల నగదు పారితోషికాన్ని అందజేస్తామని కమీషనర్ ప్రకటించారు. కమీషనరేట్ పరిధిలో 11 క్రైం బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. అంకితభావంతో పనిచేయడం వల్లనే ఈ మధ్యకాలంలో కరుడుగట్టిన నేరస్థులను అరెస్ట్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. నేరాల చేదనకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. సాంకేతి పరిజ్ఞానం వినియోగం నేరాల చేదనకు దోహదపడుతుందని తెలిపారు. నేరాల చేదనలో కీలకపాత్ర పోషించిన వారికి ప్రోత్సాహకాలను అందజేస్తామని చెప్పారు. నేరాలు జరిగిన పద్ధతులను దృష్టిలో ఉంచుకొని నేరస్థులను అంచనా వేయాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎసిపి రామారావు, ఇన్‌స్పెక్టర్లు తుల శ్రీనివాస రావు, మహేష్ గౌడ్, విజయ్ కుమార్, శశిధర్ రెడ్డి, రంగయ్య గౌడ్‌తో పాటు పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.