కరీంనగర్

హరితహారం మొక్కలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, జూన్ 27: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చెపట్టుతున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా జులై మొదటి వారంలో నుండి మొక్కలు నాటే కార్యక్రమానికి మండల అధికారులు ప్రణాళికలను సిద్దం చేశారు. మండలంలోని నాలుగు నర్సరి కేంద్రంలో ఏడు లక్షల మొక్కలు సిద్దంగా ఉన్నాయి. మండలంలోని ప్రతి గ్రామానికి 40 వేలు, మండలానికి 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం గా అధికారులు కార్యచరణను చెపట్టుతున్నారు. మండల పరిధిలోని లక్ష్మిపూర్, సదాశివపల్లి, ముంజంపల్లి, చెంజర్ల గ్రామంలోని నర్సరి కేంద్రంలో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామి పథకం అనుసందానంతో కూలీల చేత నర్సరి కేంద్రంలో చింత, గూలుమోర్, కానుగా, టేకు, సీతపలం, అడవితంగడి వంటి పలు రకాల 7 లక్షల మొక్కలు తయారు చేపట్టారు. ఈ మొక్కలను ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలోని అవరణలో, ప్రధాన రహదారులకు ఇరువైపుల, ప్రభుత్వ భూమిలో, స్మశాన వాటిక, కెనాల్ గెట్ల వెంబడి, మొక్కలు నాటేందుకు ప్రణాళికలను తయారు చేపట్టారు. గత యేడాది మండలంలో పది లక్షల మొక్కలను నాటలనే టార్గ్‌ట్ ఉన్నప్పటికి 4లక్షల 27 వేల మొక్కలు మాత్రమే అధికారులు నాటిన్నారు. నాటి మొక్కలు ఇప్పటి వరకు సుమారు 50 శాతం మాత్రమే బతికున్నాయి. ఈసంవత్సరం నాలుగు నర్సరి కేంద్రంలో 7 లక్షలు మొక్కలు మాత్రమే ఉండగా మరో మూడు లక్షల మొక్కలకు గాను 1 లక్ష పండ్ల మొక్కలను ఇతర మండలంలోని నర్సరి కేంద్రంలో నుండి మన మండలానికి తీకరానున్నారు. ఈయేడాది మండలంలో హరిత హారం కార్యాక్రమంలో భాగంగా పది లక్షల మొక్కలను నాటే కార్యక్రమాని ఓ యజ్ఞం లాగ చెపట్టనున్నట్లు ఎంపిడివో వెంకట్రాం రెడ్డి తెలిపారు.

జిఎస్‌టి అమలుపై వస్త్ర వ్యాపారుల బంద్
చొప్పదండి, జూన్ 27: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జిఎస్‌టికి నిరసనగా రాష్ట్ర వస్త్ర వ్యాపారుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం చొప్పదండి పట్టణంలో సంపూర్ణంగా అన్ని బట్టల దుకాణాలను బంద్ చేశారు. ఈ సందర్భంగా నిరసనలను వ్యక్తం చేశారు. 27, 28 తేదీలలో రెండు రోజులు సంపూర్ణ బంద్‌ను నిర్వహిస్తామని వస్త్ర వ్యాపారులు తెలిపారు. జిఎస్‌టి అమలుతో మధ్యతరగతి వస్త్ర వ్యాపారులు, చిన్నతరహా వ్యాపారులపై ప్రభావం చూపుతుందని, వెంటనే తమకు నష్టాన్ని తీసుకువచ్చే జిఎస్‌టిని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోడూరి గణేష్, దుంపేటి రాంచంద్రం, కోడూరి రాజేశం, గంగయ్య, శ్రీనివాస్, సంతోష్, రాయమల్లు, కనుకయ్య, ప్రభాకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
ముకరంపుర కరీంనగర్, జూన్ 27: కరీంనగర్ మండలం ముగ్దుంపూర్ గ్రామ శివారులో మంగళవారం కాళేశ్వరం నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్తున్న లారీ డ్రైవర్ విశాల్ (42) అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా బాలనగర్ టౌన్ షిప్‌కు చెందిన విశాల్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలిస్తుండగా మార్గమధ్యంలో ముగ్ధుంపూరు శివారులో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విశాల్ అప్రమత్తమై లారీని కంట్రోల్ చేసి అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు రూరల్ సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు.

రుణాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న బ్యాంకర్లు
* టిడిపి జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
కాల్వశ్రీరాంపూర్, జూన్ 27: రుణాలు ఇవ్వకుండా రైతులను బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణా రావు అన్నారు. మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్‌ను మంగళవారం ఆయన సందర్శించి బ్యాంక్ అధికారులతో చర్చించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలానికి రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత తరుణంలో షరతులు లేకుండా వెంటనే రైతులకు ఖరీఫ్ రుణాలు మంజూరు చేయాలన్నారు. రైతులకు రుణాలు ఇవ్వడంలో జాప్యం చేయవద్దని, బ్యాంక్ మేనేజర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట టిడిపి నాయకులు, రైతులు ఉన్నారు.

నాయా బ్రాహ్మణులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలి
* ఎమ్మెల్యే గంగులకు వినతిపత్రం
ముకరంపుర కరీంనగర్, జూన్ 27: ప్రభుత్వం పేద ప్రజలకు నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు మండలంలోని నాయి బ్రాహ్మణులకు మంజూరు చేయాలని నాయిబ్రాహ్మణ సేవా సంఘం కొత్తపల్లి మండల శాఖ కన్వీనర్ నాగవెల్లి లక్ష్మినారాయణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన నివాసంలో సంఘం ప్రతినిదులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆధునిక సెలూన్లు అర్హులకు అందించాలని, అదేవిధంగా సబ్సిడీ రుణాలు అందించి నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన వారిలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు గర్శకుర్తి శంకర్, నాగవెల్లి సత్యనారాయణ, గుంజపడుగు ఓం ప్రకాష్, శ్రీరాముల భూమయ్య, శ్రీరాముల భూమయ్య, మురహరి, నడిగొట్టు కుమార్, గుంజపడుగు పవన్ కుమార్, బత్తిని పర్శరాం, జంగం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

వస్త్ర దుకాణాల బంద్
* వస్తు సేవల పన్ను అమలుకు...
నిరసనగా వ్యాపారుల ఆందోళన
కరీంనగర్ టౌన్, జూన్ 27: జూలై 1నుంచి అమలులోకి రానున్న వస్తుసేవల పన్నును నిరసిస్తూ జిల్లాలోని వస్తద్రుకాణాలు రెండోరోజు కూడా మూతపడ్డాయి. వస్తప్రరిశ్రమను జి ఎస్టీపరిధిలోకి తేవడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా మంగళవారం నగరంలోవ్యాపారులు దుకాణాలు మూసివేసి, బంద్ పాటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. ఇంతకాలం ఎటువంటి పన్ను చెల్లింపులేని చిన్న, మద్య తరహా పరిశ్రమలపై ప్రస్తుతం ఐదు శాతం పన్ను విధించగా, అమ్మకం దుకాణాలపై మాత్రం 28శాతం పన్ను విధించటం దారుణమని దుకాణాల యజమానులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు టెక్స్‌టైల్ రంగాన్ని అత్యవసర విభాగంగా గుర్తించి, పలు మినహాయింపులు ఇవ్వగా, తాజాగా జి ఎస్టీ పరిధిలోకి తేవటంతోతమ పరిస్థితి డోలాయమానంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చే జీ ఎస్టీ కౌన్సిల్‌లోనైనా పన్ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో నగరంలోని వస్త్ర దుకాణాల యజమానులు, ఫర్నీచర్ షాపుల యజమానులు పాల్గొన్నారు.