కరీంనగర్

పారిశుద్ధ్యంలో కాసులపల్లి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూన్ 27: సంపూర్ణ పారిశుద్ధ్యం లక్ష్యంగా ఆ గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రజలు కలిసి కట్టుగా ఒక్కటయ్యారు. ఇందు కోసం ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం అందిస్తుండటంతో ఇంటింట వ్యక్తి గత మరుగు దొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టారు. మురికి కాల్వలు లేని గ్రామంగా గుర్తింపు తీసుకు వచ్చారు. అందరికి సంపూర్ణ ఆరోగ్యం కోసం దోమలు, ఈగలు లేని గ్రామంగా చేసుకొని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని కాసులపల్లి గ్రామంలో వంద శాతం వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకోవడంతో పాటు ఇంటింట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. దీనితో గ్రామంలో మురికి కాల్వల అవసరం లేకుండా పోయింది. గ్రామంలో ఉన్న మురికి కాల్వలు పూడ్చివేసి, రోడ్లు వెడల్పు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తి గత మరుగు దొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణానికి తగిన ప్రచారం కల్పించడంతో పాటు అందుకు తగిన నిధులు కూడా కెటాయిస్తున్నాయి. ఈ విషయంలో కాసులపల్లి గ్రామ సర్పంచు ఇనుగాల తిరుపతిరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు దాసరి చంద్రారెడ్డిలు ప్రజల్ని చైతన్యం చేయండంతోపాటు వ్యక్తి గత మరుగు దొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాల కోసం అహర్నిషలు కష్టపడ్డారు. ఫలితంగా గ్రామంలో వంద సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా గుర్తింపు తీసుకువచ్చారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కాసులపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం కూడా ఇందుకు కలిసి వచ్చింది. ఎమ్మెల్యే అండదండలతో గ్రామంలో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతంగా సాగాయి. అలాగే గ్రామంలో సిసి రోడ్లు, ఇతర అభవృద్ధి పనులతో ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది.
వంద శాతం పారిశుద్ధ్యంతో సంపూర్ణ ఆరోగ్యం
* సర్పంచ్ ఇనుగాల తిరుపతి రెడ్డి
వంద శాతం పారి శుద్ధ్యం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని విస్తృత ప్రచారం చేశాం. ఇందుకు ప్రజలు చక్కగా స్పందించారు. అందుకే సాధ్యమైనంత తొందరగా అనుకున్న లక్ష్యం సాధించుకున్నాం. స్థానిక ఎమ్మెల్యే సహకారం ఎంతగానో ఉంది.
గ్రామస్థుల సహకారంతోనే సాధ్యమైంది
ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయి. తమ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సహకారంతో సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం గ్రామంలో ఇంటింట వ్యక్తి గత మరుగు దొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాం. ఇదంత గ్రామస్తుల సహకారంతో సాధ్యమైంది.

ఘనంగా ఎఐఎస్‌బి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కరీంనగర్ టౌన్, జూన్ 27: ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నగరంలోఘనంగా జరిగాయి. ఆసంఘం జిల్లా కార్యాలయంలోనిర్వహించిన ఈవేడుకల్లో కేకు కోసి,మిఠాయిలు పంచి, బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్‌రెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అందరికీ సమాన విద్య అందించటమే ఎఐఎస్‌బి లక్ష్యమని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ, విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తున్నాయని, ఇందులోభాగంగానే దేశంలో పేరుమోసిన కార్పోరేట్ సంస్థ రిలయన్స్ విద్యాసంస్థలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1000 ఎకరాల భూమిని కేటాయించేందుకు సన్నాహాలు చేస్తుందని మండిపడ్డారు. విద్యను వ్యాపారీకరణ, కార్పోరేటీకరణ చేసేందుకు కుటిల యత్నాలు చేస్తుండటంలోభాగంగానే విద్యారంగ అభివృద్దిని విస్మరించాయని ఆరోపించారు.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ఎఐఎస్‌బి అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో లక్షమంది విద్యార్థులతో నేతాజీ దళాన్ని ఏర్పాటుచేసి, విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తామని, ఎన్నికల ముందు విద్యను బలోపేతం చేస్తామని చెప్పిన టి ఆర్ ఎస్ గెల్చిన అనంతరం కార్పోరేటీకరణ చేస్తుండటం శోచనీయమన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగ అభివృద్ధికి కేవలం 8శాతం నిధులు మాత్రమే కేటాయించటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. కులాలు, మతాల మద్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, తీరు మార్చుకుని విద్యారంగ అభివృద్దికి నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో దీర్ఘకాలిక ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈసమావేశంలోయువజన విభాగం రాష్ట్ర నాయకుడు జోగినపల్లి శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి నాయకులు నాగుల మల్యాల శ్రీ్ధర్, సాయితేజ, బద్దం ప్రవీన్‌రెడ్డి, నడిగొట్టు సాయికిరణ్, కర్ణాకర్‌రెడ్డి, రజిత, స్వాతి, రమ్య, నవ్య, శే్వత, మాలతి, తదితరులు పాల్గొన్నారు.