కరీంనగర్

హరితహారం లక్ష్యాన్ని సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, ఆగస్టు 22: హరితహారంలో భాగంగా జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌తో విడియోకాన్పరెన్స్‌లో హరిత హారంపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ఈకార్యక్రమంలో భాగంగా జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రజలను భాగస్వామ్యం చేసి హరిత హారాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి ఇంట్లో ఎంత మంది సభ్యులు నివాసం ఉంటే అన్ని మొక్కలు వారి పేరు మీద నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పెద్దల పేర్లపై కూడా మొక్కలు నాటి సంరక్షించాలని, నాటిన ప్రతి మొక్కకు జియో టాగింగ్ పూర్తి చేయాలని, ప్రతి మొక్క ఎదుగుదలపై శ్రద్ద వహించాలన్నారు. నాటే ప్రతి మొక్కకు రక్షణ కవచం (ట్రీ గార్డ్) ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో నాటిన ప్రతి మొక్కలను రక్షించడం అంతే ముఖ్యమని అన్నారు. జిల్లాలోని అధికారులు వారి శాఖల వారిగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రజలకు ఏమొక్కలు అవసరం అయితే ఆమొక్కలు పంపిణీ చేయాలని అన్నారు. పరిశ్రమలలో, పారిశ్రామికవాడలో, ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రతి ఆసుపత్రిలో, పాఠశాలలో మొక్కలు నాటాలని అన్నారు. 230కోట్ల మొక్కల పెంపకమే లక్ష్యంగా తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీని దశల వారిగా పూర్తి చేస్తున్నామని, ప్రపంచంలో ఇది మూడవ అతి పెద్ద ప్రయత్నమని, దీని విజయవంతం చేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకరావాలని అన్నారు. హరిత హారం ద్వారా ఆశించిన పలితాలు లభిస్తాయని అన్నారు. ఈమొక్కలను పెంచడం ద్వారా మన ప్రాంత భూభాగంలోని వాతావరణం సమతుల్యంగా ఉంటుందని, మంచి వర్షాలు కురుస్తాయని, హరిత హారాన్ని విజయవంతం చేయడం ద్వారా మన భావితరాలకు మంచి ప్రకృతి అందిస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డి ఎఫ్ ఓ కృష్ణమాచారి, ఇన్‌చార్జి డి ఆర్ డి ఓ ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.