కరీంనగర్

ఉన్నత ప్రతిభ చాటితేనే భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, సెప్టెంబర్ 18: విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే తప్పనిసరిగా చిన్నతనం నుంచే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను కొనసాగించినప్పుడే భవిష్యత్ ఉంటుందని కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం చొప్పదండి మండల పరిధిలోని ఆర్నకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభ పురస్కారాలను ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు దామెర అనసూయ-జీవన్ రెడ్డిల పేరిట మొదటి స్థానం పొందిన విద్యార్థికి 10వేల రూపాయలు, ద్వితీయ, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు 5వేల చొప్పున ఇవ్వగా వాటిని అందించారు. అనంతరం సిపి మాట్లాడుతు పోటీ ప్రస్తుతం ప్రతి అంశంలో తీవ్రంగా ఉందని, విద్యార్థులు బట్టి పద్దతి కాకుండా, పాఠ్యాంశాలను పూర్తిగా ఆకలింపు చేసుకున్నప్పుడే మంచి ప్రతిభకు ఆస్కారం ఉంటుందని, ఆ దిశగా ఉపాద్యాయులు ఇచ్చే సూచనలు పాటిస్తు ముందకు సాగితే తప్పకుండా విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. ఇలాంటి ప్రోత్సాహక అవార్డుల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీయడానికి అవకాశం ఉంటుందని, ఇలాంటి అవార్డులు ఇస్తున్న వారిని అభినందించారు.
సిసి కెమరాలు ప్రారంభం
మండల పరిలోని ఆర్నకొండలో గ్రామస్థులు విరాళాలుగా ఇచ్చిన మొత్తంతో పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన సిసి కెమరాలను సిపి కమలాసన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. సిఐ రమేష్, ఎస్సై చంద్రశేఖర్, సర్పంచ్ గంటల అనిత-రమణారెడ్డి, రాపెల్లి ఐలయ్య యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
రెస్టారెంట్‌పై టాస్క్ఫోర్స్ దాడి
* కుళ్లిన ఆహారం, మాంసం పట్టివేత * పుడ్ ఇన్‌స్పెక్టర్ అమృతశ్రీ వెల్లడి
మానకొండూర్, సెప్టెంబర్ 18: మానకొండూర్ గ్రామంలోని మా అభిరూచి ఫ్యామీ లి రెస్టారెంట్ పై టాస్క్ఫోర్స్ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పుడ్ ఇన్‌స్పెక్టర్ అమృత శ్రీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మానకొండూర్ కేం ద్రంలోని మా అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ పై టాస్క్‌పోర్స్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడి చేపట్టిన్నట్లు తెలిపారు. దాడులో భాగంగా రెస్టారెంట్‌ను తనికి చేయగా నాలుగు రోజులుగా నిల్వ ఉన్న కుళ్లిపోయిన మాంసం, బిర్యానీ పట్టుకున్నామని తెలిపారు. ఈ రెస్టారెంట్ అనుమతి లేకుండానే కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుందన్నారు. రెస్టారెంట్‌లో మాంసం, బిర్యాని కుళ్లిపోయిన వాసన రాకుండా ఉండడానికి బ్యూటీ కేర్‌లో వాడే రోజ్‌వాటర్‌ను బిర్యానీలో వాడుతున్నారని తెలిపారు. రెస్టారెంట్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించాలని రెస్టారెంట్ యాజమాన్యం శ్రీపతికి అధికారులు సూచించగా అనుమతి పత్రాలు లేవని తెలపడం జరిగిందన్నారు. దాడి చేసి పట్టుపడ్డిన కుళ్లిన మాంసం, బిర్యాని, పదార్థలను హైదరాబాద్‌లోని పుడ్ సెప్టి కార్యాలయానికి శ్యాంపిల్‌గా పంపించడం జరిగిందన్నారు. దాడుల్లో టాస్క్‌పోర్స్ ఎస్‌ఐలు కిరణ్, సంతోష్, నాగరాజు, కానిస్టెబుల్ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆడపడుచుల ఆత్మగౌరవానికి పెద్దపీట
* ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, సెప్టెంబర్ 18: ఆడపడుచులంటే సిఎం కేసిఆర్‌కు వల్లమాలిన అభిమానమని, వారి ఆత్మగౌరవానికి ముఖ్యమంత్రి పెద్దపీటవేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ శ్లాఘించారు. సోమవారం ధర్మపురి క్షేత్రంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రంలో 80వేల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు, 75వేల కల్యా ణ లక్ష్మి ఆర్థిక సాయం, ప్రసూతి, బాలింతలకై కేసిఆర్‌కిట్లు, ఊహించని విధంగా మునె్నన్నడూ లేని విధంగా, లక్షలాది బీడీ కార్మికులకు పెన్షన్లు, ప్రస్తుతం బతుకమ్మ చీరల పంపిణీ లాంటి అరుదైన, గతంలో లేని మహిళా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కీర్తించారు. కలెక్టర్ శరత్, జగిత్యాల ఆర్డీఓ డాక్టర్ డాక్టర్ నరేందర్ పాల్గొన్నారు. ఉపసర్పంచ్ రామయ్య నిర్వహించిన కార్యక్రమంలో ధర్మపురి ఎంపిపి మమతారావు, జడ్పిటిసి రాజమణి, వైస్ ఎంపిపి రాజేశ్ కుమార్, దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు రాజేందర్, నరేశ్, సర్పంచ్ సత్తమ్మ, మండల రైతు సమితి సమన్వయకర్త భీమయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ శంకర్, ఎంపిటిసిలు విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, రమేశ్, తహశీల్‌దార్ నవీన్, కోఆప్షన్ సభ్యులు ఆసిఫ్, ఇంచార్జి ఎంపిడిఓ రాణి, మహేశ్, కిశోర్‌రావు, వందలాది మహిళలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు భాగస్వాములైనారు.
పేద మహిళల పండుగ కానుకగా చీరలు
* ఎమ్మెల్సీ భానుప్రసాద రావు
జూలపల్లి, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా సిఎం కెసిఆర్ పేద మహిళల అభ్యున్నతి కోసమే దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్సీ భానుప్రసాద రావు, ఐడిసిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డిలు అన్నారు. సోమవారం ఎలిగేడు, లోకపేట గ్రామాల్లో చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జూలపల్లి మండలంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపిపి పల్లె అంజమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎలుబాక రాజయ్య, ఎంపిపి కవ్వంపల్లి లక్ష్మి, జడ్పీటిసి పడాల తార, సర్పంచ్‌లు రాయనర్సయ్య, ప్రసాద రావు, పర్శరాములు గౌడ్, తహశీల్దార్ సురేష్, ఎంపిడిఓ వేణుగోపాల రావు, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్ రావు, పంచాయతీ కార్యదర్శి సంపత్ కృష్ణారెడ్డి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రాణులన్నీ పరమాత్మునికి సమానమే
* త్రిదండి దేవానాథ రామానుజ జీయర్‌స్వామి
చందుర్తి, సెప్టెంబర్ 18: సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ పరమాత్మునికి సమానమేనని, అందరి ఆత్మలో దేవుడు ఉంటాడని త్రిదండి దేవానాథ రామానుజ జీయర్‌స్వామి పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో రెడ్డి ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మానవుడి శరీరంలోని భాగాలు ఎంత ముఖ్యమో దేవుడికి ప్రాణులు అంతేనని అన్నారు. పరమాత్ముడి సేవలో పాల్గొన్నపుడే వారి ఆత్మ స్వర్గానికి చేరుతోందని అన్నారు.అను నిత్యం శ్రీమన్నారాయణుని సేవలో నిమగ్నం కావాలని అన్నారు. గతంలో తన తండ్రి రుద్రంగి గ్రామస్థుడని గుర్తు చేశారు. గ్రామంతో తమ కుటుంబానికి విడిపోని అనుబంధం ఉందని అన్నారు. అనంతరం స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. వేములవాడ ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు గంగాధర్, సర్పంచ్ గంగరాజు గంగమల్లయ్య, ఎమ్పిటిసిలు పావని, నర్సయ్య, చిన్న రాజవ్వ, నాయకులు వెంకట్‌రెడ్డి, నిత్యానందరావు, వెంకటేశ్వర్‌రావు, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.