కరీంనగర్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 20: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలోఅంటూ నగరంలోబతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. వాడవాడలా ఆడపడచులు ఆట పాటలతో ఆడి పాడారు. పూల పండుగలో మొదటిరోజు ఎంగిలిపూల సందర్భంగా చిన్నారులు, యువతులు తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేషధారణ గావించి, చేతుల్లో చిన్న బతుకమ్మలతోసందడి చేశారు. పలు దేవాలయాలు, చావడిల్లో ఏర్పాటు చేసిన వేదికల వద్దకు చేరుకుని పండగ ప్రాశస్ధాన్ని గుర్తుచేసుకుంటూ బతుకమ్మ పాటలతో ఆకట్టుకున్నారు. కోతిరాంపూర్‌లోని గిద్దె పెరుమాళ్ళ దేవాలయం, పోచమ్మ దేవాలయం, కట్టరాంపూర్‌లోహన్‌మాన్ దేవాలయంలోపండగ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 50 డివిజన్లలో ఏర్పాటు చేసిన వేదికల వద్ద ఆయా డివిజన్ల కార్పోరేటర్ల నేతృత్వంలోవేడుకలు ప్రారంభం కాగా, టవర్‌సర్కిల్‌లో మేయర్ రవీందర్‌సింగ్, కార్పోరేటర్ కమల్‌జిత్‌కౌర్‌లు, 26వ డివిజన్‌లోకార్పోరేటర్ కట్ల విద్య, 27వ డివిజన్‌లో ఎల్.రూప్‌సింగ్‌లు వేడుకల్లో పాల్గొన్నారు.

చీరల కొనుగోలులో రూ.154 కోట్ల కుంభకోణం!

సిరిసిల్ల, సెప్టెంబర్ 20: సూరత్‌లో కొనుగోలు చేసిన 54 లక్షల బతుకమ్మ చీరల్లో రూ.155 కోట్ల కుంభకోణం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు ఆరోపించారు. ఈమేరకు బతుకమ్మ చీరల పంపిణీపై గ్రామాలను సందర్శించి సిపిఐ ఆధ్వర్యంలో నిజ నిర్థారణ కమిటి పరిశీలించింది. అనంతరం బుధవారం ఇక్కడ వివరాలను విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఆరు వేల చీరలు మహిళలకు పంచడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో సిరిసిల్ల నేత కార్మికులకు 52 లక్షల చీరలన ఉత్పత్తి చేయడానికి ఆర్డర్లు ఇవ్వడగా, సిరిసిల్ల కార్మికులు నేసిన చీరలు నాణ్యత, మన్నికలోనూ పది కాలాల పాటు మనే్నలా ఉన్నాయన్నారు. కార్మికుల శ్రమకు తగ్గట్టుగా స్థానికులు తయారు చేసిన చీరలు అందంగా ఉన్నాయనీ, కానీ సూరత్‌లో తెచ్చిన 54 లక్షల చీరల ఆర్డర్లలో రూ.158 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.
సూరత్ వస్త్ర వ్యాపారులతో జరిగిన లావాదేవీల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.158 కోట్ల కుంభకోణానికి గురై చీరల నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం మూలంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇచ్చిన చీరలు రంద్రాలు పడి, పలుచగా ఉండి కాల్చివేసిన సంఘటనలు సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఇవన్నీ సిరిసిల్లలో నేసిన చీరలు కావన్నారు. కేవలం సూరత్‌లో నేసిన చీరలు మాత్రేమే నాణ్యత లేకుండా ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాలలో చీరలు కాల్చివేసినపుడు సిరిసిల్ల నేత కార్మికుల పని తనాన్ని తప్పు పట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
బతుకమ్మకు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న చీరలకు సిరిసిల్ల నుండి ఉత్పత్తి చేశామని, సిరిసిల్ల కార్మికులకు చేతి నిండా పని కల్పించామని విస్తృతంగా ప్రచారం చేసిన ప్రభుత్వం సూరత్‌లో ఒక్కొక్క చీర తూకంలో వేసి కొనుగోలు చేసి రూ.30 నుండి రూ.60లకు మించలేదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధరల్లో రూ.224, రూ.200ల చొప్పున ప్రకటించిందన్నారు. నాణ్యత ప్రమాణాలు సూరత్ నుండి తెచ్చిన చీరల్లో కనుపించలేదు. దీనికి 18,19,20 తేదీలలో కొన్ని గ్రామాలలో ఇచ్చిన చీరలను సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా పూనుకున్నదన్నారు. నిజంగానే పేద వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది నిజాయితీ ఉన్నా వారి ఖాతాలలో చీరలు కొనుక్కోవడానికి రూ.1500 వేస్తే ప్రభుత్వ నిజాయితీపై ఆలోచించేవారమన్నారు. కానీ వాస్తవం చెపుతున్నటువంటి పార్టీలపై, దుమ్మెత్తి పోయడానికి కెసి ఆర్ ప్రభుత్వానికి సమయం సరిపోవడం లేదు. తక్షణంగా చీరలు కాల్చివేసిన దానిలో అనేక మందిపై కేసులు పెట్టారని, వారిపై వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది.
చీరల నాణ్యత లోపాలుంటే కాల్చివేయకుండా ప్రభుత్వానికే తిరిగి ఇచ్చివేసి తమ నిరసన తెలియచేసి, ప్రభుత్వ అవకాశ వాద రాజకీయాలను, రూ.158 కోట్ల కుంభకోణంపై విస్తృతంగ ప్రచారం చేయాలని మహిళా లోకానికి విజ్ఞప్తి చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న విషయంలో కానీ, గొర్రెలు, బర్రెలు, రైతులకు ఎరువులు ఇవన్నీ ఎన్నికల తంతులో భాగమేనని సిపి ఐ భావిస్తున్నట్టు వేణు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మంత్రి చంద్రన్న, బిసి సబ్ ప్లాన్ జిల్లా కన్వీనర్ అజ్జు వేణు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దడిగె రవి, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి జంగపెల్లి లచ్చయ్యలు పాల్గొన్నారు.

గుత్తేదారు నిర్లక్ష్యంతోనే కార్మికుల మృతి
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 20: తిప్పాపూర్‌లో ప్రాణహిత చేవెళ్ళ అండర్ టనె్నల్ పనుల్లో గుత్తేదారు నిర్లక్ష్యంతోనే ఏడుగురు ప్రాణాలు మట్టిపాలయ్యాయని కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు తాటిపర్తి జీవన్‌రెడ్డి, దుద్దిళ్ళ శ్రీ్ధర్‌బాబులు ఆరోపించారు. ఇక్కడి సివిలాస్పత్రిలో మృతదేహాలను సందర్శించిన అనంతరం వారు విలేఖరులతోమాట్లాడుతూ, ప్రభుత్వ అండతోనే గుత్తేదారు నిర్లక్ష్యంగా అండర్ టనె్నల్ పనులు కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ప్రమాద ఘటనపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. సొరంగమార్గంలో ప్రమాణాలు పాటించాల్సి ఉండగా, కనీస రక్షణచర్యలు కూడా తీసుకోకపోవటంతోనే ఘోరప్రమాదానికి కారణమైందని మండిపడ్డారు. కార్మికుల జీవితాలోం చెలగాటమాడుతున్న గుత్తేదారును వెంటనే అరెస్టు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఓవైపుమట్టితొలగించే పనులు జరుగుతుండగానే, మరోవైపుబాంబు బ్లాస్టింగ్‌లు చేయటంతోనే పైకప్పు కూలినట్లు తోటి కార్మికులే పేర్కొంటున్నా, వారి మరణాలను తప్పుదారి పట్టించేందుకు గుత్తేదారు యత్నిస్తున్నాడని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు సైతం గుత్తేదారుకు వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి పొట్టకూటికోసం వచ్చి కూలిపనులు చేస్తుంటే, కేసులు కూడా నమోదు చేయకుండా పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతించటం శోచనీయమన్నారు.ఈ సంఘటనకు ఇంజనీరింగ్ అధికారులను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల మరణాల సమాచారం వారి కుటుంబసభ్యులకు కూడా ఇప్పటివరకు చేరవేయకపోవటం బాధ్యతారాహిత్యాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. సిపిఐ జిల్లాకార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, నామమాత్రపు పరిహారం చెల్లించి, చేతులు దులుపుకునేందుకు అధికారులు, గుత్తేదారు యత్నిస్తున్నారని, మృతుల కుటుంబాలకు రూ. 20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
టిడిపి జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఘటనకు బాధ్యుడైన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర నాయకుడు కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ, కార్మికుల జీవితాలతోచెలగాటమాడిన సంబంధిత అధికారులను డిస్మిస్ చేయాలని, గుత్తేదారును బ్లాక్‌లిస్టులో చేర్చి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ, నాసిరకం పనులతోకార్మికుల ప్రాణాలు తీస్తున్న కాంట్రాక్టర్, ఆయనకు సహకరిస్తున్న అధికారులను వెంటనే ఉద్యోగాల్లోనుంచి శాశ్వతంగా తొలగించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుని, ఇంటికొక ప్రభుత్వోద్యోగం కల్పించాలన్నారు. మృతదేహాలను సందర్శించిన వారిలోమాజీ విప్ ఆరెపల్లిమోహన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, ఎమ్మెల్యే కమలాకర్, కాంగ్రెస్ నాయకులు కర్ర రాజశేఖర్‌లతో పాటు పలువురు స్థానిక నాయకులు ఉన్నారు.

మానవ హక్కులకు చెల్లుచీటీ!

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో మానవ హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం బలహీన వర్గాలను తన్ని తరుముతోందని మాజీ మంత్రి, పిసిసి సమన్వయకర్త దుద్దిళ్ళ శ్రీ్ధర్‌బాబు అన్నారు. కాంగ్రెస్ మద్దతుదారులైన దళితులు, సామాన్య వర్గాలపై కక్షగట్టి, వారిని అణిచివేతకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. నేరెళ్ళ బాధితులకు న్యాయం చేయాలంటూ, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తోకలెక్టరేట్ ఎదుట జిల్లాకాంగ్రెస్ చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లోభాగంగా 6వ రోజు ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పాలన అత్యంత దుర్మార్గంగా కొనసాగుతోందని మండిపడ్డారు. మంథని, పెద్దపల్లి, నేరెళ్ళలో జరిగిన పైశాచిక దాడులు ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఈమూడు ఘటనల్లో ఇప్పటివరకు బాధ్యులైన పోలీసులు, అధికార నేతలపై కనీస చర్యల్లేవని దుయ్యబట్టారు. సిరిసిల్ల సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించి, జాతీయ ఎస్సీ కమీషన్ సైతం విచారణ జరిపి, ఎస్పీపై చర్యలు తీసుకోవాలంటూ సిఫారసు చేసినా ఇప్పటివరకు స్పందన లేకపోవటం ప్రభుత్వ దమననీతికి దర్పణం పడుతోందన్నారు. బాధితులకు సరైన వైద్య చికిత్సలందించటంలో కూడా నిర్లక్ష్యం వహిస్తోందని, నిమ్స్‌లోచికిత్స జరుపకుండా, అర్దరాత్రి పూట గెంటేయటం వెనుక ఎవరి ఒత్తిళ్ళు ఉన్నాయో రాష్ట్ర ప్రజానీకం గమనిస్తోందన్నారు. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ అరాచకాలు గ్రామాల్లో తెలియచెప్పేందుకు కాంగ్రెస్ పల్లెబాట పడుతోందన్నారు. దళితులపై దురాగతాలకు పాల్పడుతున్న వైనాన్ని బహిర్గతం చేస్తూ, ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకే రిలే దీక్షలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఇంతటితోనే ఉద్యమం ఆగదని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలోవివరించబోతున్నట్లు వెల్లడించారు. ఈరిలేదీక్షల్లో తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మన్‌కుమార్, నాయకులు శశిభూషన్‌కాచే, చల్ల నారాయణరెడ్డి, ఉప్పుల అంజనీ ప్రసాద్, కర్ర రాజశేఖర్, జువ్వాడి నిఖిల్, ఆమ ఆనంద్, అంజన్‌కుమార్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు చెర్ల పద్మదానయ్య, జి.మాధవితో పాటు జిల్లానలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.