కరీంనగర్

వైద్యుల పనితీరులో మార్పు లేదు: ఈటల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 21: హుజురాబాద్, జమ్మికుంట ఆసుపత్రుల వైద్యుల పనితీరులో మార్పులు రావడం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మికుంట ఆసుపత్రిని సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, అక్కడి డాక్టర్లను వెంటనే మార్చాలని, హుజురాబాద్ ఆసుపత్రిని పూర్తి చేసి దసరాలోగా అప్పగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించామని, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బకాయి బిల్లులన్నింటిని అక్టోబర్‌లోగా చెల్లించాలని తెలిపారు. అక్టోబర్ నుండి జిల్లాలో కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్‌లను పెళ్లి పందిరిలోనే అందించేలా చర్యలు తీసుకోవాలని, దసరాలోగా హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 3,900 ఇళ్లు మంజూరు కాగా, 3,500 టెండర్లు పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన వాటికి వారంలోగా టెండర్లు పూర్తి చేస్తామని అన్నారు. రైతుల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వెంటనే ఇవ్వాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, హుజురాబాద్ ఆర్డీఓ చెన్నయ్య, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రాజేశం, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్ రావు, డిపిఓ నారాయణరావులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.