కరీంనగర్

రసమయి రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 25: మూడెకరాల భూమి ఆశచూపి, నోట్లో మట్టి కొట్టి, అమాయక దళిత యువకుని మరణానికి కారణమైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే రాజీనామా చేయాలని బిజెపి దళిత మోర్చా జిల్లాశాఖ ఆధ్వర్యంలోసోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, మహాంకాళి శ్రీనివాస్‌ది ము మ్మాటికి ప్రభుత్వ హత్యేనని, మూడెకరాల భూమి ఇస్తానంటూ ఏళ్ళ తరబడి తన చుట్టూ తిప్పుకున్న ఎమ్మెల్యే రసమయిని నిలదీయటంతో బెదిరింపులకు గురిచేసి, పరోక్షంగా ఆత్మహత్యకు ఉసిగొల్పాడని ఆరోపించారు. శ్రీనివాస్ మరణానికి కారణమైన వారిపై ఐపిసి 306కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, మృతుడి భార్యకు ప్రభుత్వోద్యోగం కల్పించాలన్నారు. పిల్లలను ప్రభుత్వమే దత్తత తీసుకుని చదివించాలని కోరారు. అర్హులైన దళితులకు ఎలాంటి అవినీతి,అక్రమాలకు తావులేకుండా మూడు ఎకరాల భూమిని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను మంజూరీ చేయాలన్నారు. బిజెపి కార్యకర్తలు దళితుల ఇళ్ళకు వెళ్ళి అర్హులైన వారికి అందించాల్సిన ప్రభుత్వ పథకాలపై ధరఖాస్తులు భర్తీ చేసి సంబంధితాధికారులకు అందజేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటింటికి బిజెపి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలుప్రజల్లోకి తీసుకెళ్ళనున్నట్లు, టిఆర్‌ఎస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందజేస్తున్న వైనంపై కూలంకషంగా వివరిస్తూ, గ్రామీణులను చైతన్యపర్చనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు వెళ్ళిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోగా, కొద్దిసేపు ఇరువర్గాల మద్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. కలెక్టర్‌ను కలవనిదే వెనుదిరగబోమంటూ బిజెపి కార్యకర్తలు భీష్మించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జిల్లాపోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, సుంకపాక విద్యాసాగర్, జేరిపోతుల శంకర్, సిరిసిల్ల కొమురయ్య, బి.లక్ష్మినారాయణ, కొంకటి హరీష్,గుండేటి జితెందర్‌రెడ్డి, అస్లాం, తదితరులు పాల్గొన్నారు.
‘వారసత్వం’ సిఎంతోనే సాధ్యం
* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వివేకానంద
యైటింక్లయిన్‌కాలనీ, సెప్టెంబర్ 25: సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల హక్కు అమలు చేయడం కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్ తెలిపారు. సోమవారం సింగరేణి ఆర్జీ-3 ఓసిపి-1 బేస్ వర్క్‌షాప్ వద్ద తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) ఆధ్వర్యంలో గేట్ మీటిం గ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారంగా దసరా కానుకగా వారసత్వ ఉద్యోగాలపై సిఎం కెసిఆర్ ప్రకటన చేశారని తెలిపారు. జాతీయ సంఘాలు కుట్ర లు పన్ని అవి రద్దయ్యేందుకు కారణమయ్యాయని తెలిపారు. ఇ ప్పుడు కార్మికుల వద్ద వారసత్వ ఉద్యోగాలపై జాతీయ సంఘాలు ముసలీ కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. సింగరేణి పని చేస్తున్న ప్రతీఒక్క కార్మికుని సొం తింటి కలను రానున్న రోజుల్లో సిఎం నెరవేర్చి తీరుతారని చెప్పా రు. దీనికి గాను రూ.10లక్షలు వడ్డీ లేని రుణం ఇప్పించేందుకు ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. సింగరేణి సంస్థ నష్టాల్లో నడుస్తూ బిఐఎఫ్‌ఆర్ పరిధిలోకి వెళ్లే క్రమం లో తన తండ్రి వెంకటస్వామి అ ప్పటి కేంద్రప్రభుత్వంతో మాట్లాడి వడ్డీ మాఫీ చేయించి కాపాడారని తెలిపారు. అదేవిధంగా మూసివేసిన ఎఫ్‌సిఐ తిరిగి పునఃప్రారంభించేందుకు తాను ఎంతో కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి పాటు పడే కార్మికులపై సిఎం కెసిఆర్‌కు, తనకు అమితమైన ప్రే మ ఉందని చెప్పారు. కార్మిక సమస్యలపై ఎప్పటికప్పుడు కెసి ఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. జాతీయ సంఘాలు టిబిజికెఎస్‌పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను కార్మికులు నమ్మవద్దని సూచించారు. అధికార టి ఆర్ ఎస్ పార్టీకి చెందిన టిబిజికె ఎస్‌తోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని కార్మికులు గుర్తించాలని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో టిబిజికెఎస్‌ను అన్ని డివిజన్లలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయనతోపాటు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. అదేవిధంగా ఓసిపి-3 వద్ద ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భాను ప్రసాద్, వికెపి గనిలో ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ ప్రసంగించారు. నాయకులు ఐలి శ్రీనివాస్, కొత్త సత్యనారాయణ రెడ్డి, సత్యనారాయణ, గంట వెంకట రమణారెడ్డి, నూనె కొమురయ్య, పెర్కారీ నాగేశ్వర్ రావు, కొలిపాక మురళీ, కాంతాల కిషన్ రెడ్డి, రఘువీరారెడ్డి, గాదె సురేష్, హమీద్, తదితరులున్నారు.

బతుకమ్మ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
* డిఆర్‌ఓ ఆయేషా మస్రత్ ఖానమ్
ముకరంపుర కరీంనగర్, సెప్టెంబర్ 25: నగరంలో జ్యోతిభాపూలె (సర్కస్ మైదానం)లో అధికారికంగా నిర్వహించుటకు బతుకమ్మ వేడుకలకు విస్తృత ఏర్పాట్లను చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అదికారి ఆయేషా మస్రత్ ఖానమ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై మహిళ అధికారులు, జిల్లా అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రౌండు డయాస్, చైర్లు, తాగునీటి వసతి, బతుకమ్మ సర్కిళ్లు, లైటింగ్ పనులను నగరపాలక సంస్థ చేపట్టాలన్నారు. బతుకమ్మ వేడుకలకు ప్రతీ మండలం నుంచి ఒక బతుకమ్మను పంపించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సిఇఓకు సూచించారు. డిఆర్‌డిఎ, మెప్మా, స్వశక్తి సంఘాల మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలతో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలు, టీచర్లు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు బతుకమ్మలతో రావాలన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల తరపున ఒక్కొక్క పెద్ద బతుకమ్మతో కుటుంబ సభ్యులతో సహా కలిసి రావాలని కోరారు.
సమావేశంలో డిఆర్‌డిఓ వెంకటేశ్వర్ రావు, సమాచార శాఖ డిడి వెంకటేశ్వర్ రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, జిల్లా సంక్షేమాధికారి శారద, డిఎస్‌ఓ ఉషారాణి, ఎఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.