కరీంనగర్

వేదాలతోనే ధర్మ పరిరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, అక్టోబర్ 15: భారతీయ సంస్కృతికి పునాది వేదాలని,వేదాలను మినహాయించి ధర్మాన్ని,సంస్కృతిని ఊహించలేమి,జగత్తు యొక్క ఆస్తిత్వము ధర్మము మీద ఆధారపడి ఉంటుందని,్ధర్మము నిర్వచించ వలసనవి వేదాలని,వేదాధ్యయనం ద్వారానే ధర్మపరిరక్షణ జరుగుతుందని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావుఅన్నారు.ఆదివారం జరిగిన శ్రీ జనార్దనానంద సరస్వతీ స్మృతి ట్రస్టు నిర్వహించిన వేద మహాసభల ముగింపుసమావేశానికి ఆయన విచ్చేసి ప్రసంగించారు.వేద విద్య పరిరక్షణకు సమాజ భాగస్వామ్యం అవసరమని అన్నారు.వేదకాలంలో వేదవిద్య పోషణ పాలించే రాజులే చేసుకునేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వేద విద్య ప్రోత్సహానికి సమాజం నుంచి తగిన సహాయ సహకారాలు అవసరమని అన్నారు.వేదవిద్య పరిరక్షణకు,తగిన ప్రోత్సహానికి దేవాయాలు,హిందూ సమాజం ఇతోధిక సహకారాలు అందించాలని అన్నారు. గత 17 సంవత్సరాలుగా ట్రస్టు చేస్తున్న కృషిని అభినందించారు. వేద విద్యను అభ్యసించి విద్యార్థులు ఆదర్శవంతమైన జీవితాన్ని అలవర్చుకోని సమాజ హితం కోసం పాటుపడాలని కోరారు.వేద విద్య ద్వారానే మేధస్సు పదునెక్కుతుందని అన్నారు.ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ వేద విద్య ద్వారానే హిందు ధర్మ పరిరక్షణ జరుగుతుందని అన్నారు.తెలంగాణలో వేద విద్య పూర్వవైభవం సంతరించుకోడానికి శ్రీ జనార్దనానంద సరస్వతీ స్మృతీ ట్రస్టు 17సంవత్సరాలు అంకిత భావంతో చేస్తున్న కృషిని ని కోనియాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహదారులు కెవి రమణాచారి,వేణుగోపాలచారి,నగర పంచాయితీ చైర్మన్ నామాల ఉమాలక్ష్మిరాజం, ట్రస్టు కార్యదర్శి తూములూరి శాయినాథ శర్మ,శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రహ్మణ్యం ,బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ,బ్రహ్మణ సంఘం అధ్యక్షులు గుండార్సు సుధాకర్‌రావు,మధురాధకిషన్,గర్శకుర్తి వెంకటేశ్వర్లు,పురాణం రాము, కృపాల్, చందు,కార్తీక్,గుమ్మిపవన్, తదితరులు పాల్గోన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేర్చాలి
* ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, అక్టోబర్ 15: ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస, రాజకీయ పార్టీగా ప్రజల మద్దతుతో సుదీర్ఘ పోరాటంతో, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమేకాక, తొలి ప్రభుత్వ పాలనా పగ్గాలు చేపట్ట గలిగిందని, తద్వారా దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ఆదివారం ధర్మపురి మండలం తిమ్మాపూర్ పరిధిలోని బూరుగుపల్లెలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. సిసిరోడుకు శంకుస్థాపన చేశారు. 2కోట్లతో చేపట్టనున్న శ్రీరాంసాగర్ కాలువల మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ, తెరాస ప్రజా ప్రతినిధులు, పదాధికారులు, నేతలు, కార్యకర్తలు తెరాస పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దరి చేర్చాలని కోరారు. కేసిఆర్ ప్రభుత్వంపై విశ్వాసముంచి, తమ పార్టీలో చేరిన కొత్తవారు, పాతవారూ కలగలిసి, తెలంగాణ పునర్నిర్మాణంలో తమవంతు కృషి సల్పాలని, అందరు కలిసి కట్టుగా కలిసి పని చేయాలని సూచించారు. కేసిఆర్ సిఎంగా దేశంలో ప్రత్యేక స్థానం పొందారని, ఆయన నేతృత్వంలో తెలంగాణ వివిధ రంగాలలో అభివృద్ధి పథంలో నడుస్తున్నదన్నారు. ధర్మపురి మండల తెరాస మల్లేశం, ధర్మపురి ఎంపిపి మమత, ఉపాధ్యక్షులు రాజేశ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్, దేవస్థానం చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపిపి కోప్షన్ సభ్యులు ఆసిఫ్, మండల రైతు సమన్వయకర్త భీమయ్య, ఎంపిటిసిలు కస్తూరి రాధ, రమేశ్, విజయలక్ష్మి, కిశోర్‌రావు, రామయ్య, లింగన్న, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.