కరీంనగర్

షానాగర్‌లో భూ శుద్ధీకరణ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, అక్టోబర్ 15: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని షానగర్ గ్రామంలో ప్రారంభించారు. సంబంధించిన 1-బి పత్రాలు ఈ సందర్భంగా అధికారులు రైతులకు అందించారు. తమ వద్ద గల పాస్ బుక్కులతో 1-బిలను సరి పోల్చుకోవాలని రైతులకు సూచన చేశారు. ప్రభుత్వం చేపట్టిన అవకాశాన్ని రైతులు తమ తమ సమస్యలు రెవెన్యూవారి సమక్షంలో పరిష్కారం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ గునుకొండ అశోక్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఇటి రాజ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు
సుల్తానాబాద్, అక్టోబర్ 15: ఈ నెల 14 నుండి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి పాఠశాలల 17 సంవత్సరాలలోపు బాల, బాలికల వెయిట్‌లిఫ్టింగ్ పోటీలలో 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, ఎంపికైన విద్యార్థులు ఈ నెల 17 నుండి రంగారెడ్డి జిల్లా లాలాపేట్‌లో జరుగు 63వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి అంతటి శంకరయ్యలు ఆదివారం తెలిపారు. బాలురలో ఎనిమిది మంది విద్యార్థులు, బాలికల్లో ఎనిమిది మంది విద్యార్థినులు ఎంపికయ్యారని, వీరు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు.
రూ.3 లక్షల విలువ గల గుట్కాలు స్వాధీనం
రాయికల్, అక్టోబర్ 15: మండల కేంద్రమైన రాయికల్‌లో రూ. 3 లక్షలు విలువైనా నిషేదిత గుట్కాలను ఆదివారం పట్టు కున్నట్లు ఎస్సై శివకృష్ణ తెలిపారు. ఇదే పట్టణానికి చెందిన అయిత నవీన్ అనే వ్యాపారి, రాజేందర్ అనే మరో యువకుడితో కారులో దాదాపు 3 లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లను రాయికల్‌లో విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకుని కారును, ద్విచక్ర వాహానాన్ని, గుట్కాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
* టిడిపి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ
గంగాధర, అక్టోబర్ 15: అకాల వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. ఆదివారం మండలంలోని ర్యాలపల్లి గ్రామంలో భారీ వర్షాలతో నేలవాలిన వరి పంటను టిడిపి నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యంతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు చేతికందే సమయానికి భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరుగగా అట్టి పంటలను పరిశీలించడంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ పనితీరును విమర్శించే నాయకులపై అక్రమ కేసులు బనాయించి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారే కానీ, ప్రజా సమస్యలను పరిష్కరిద్ధామనే చిత్తశుద్ధి పాలకులకు లేదన్నారు. పంట నష్టపోయన రైతులకు ఎకరాకు పత్తి 60 వేలు, వరి 40 వేలు, మొక్కజొన్నకు 30 వేల రూపాయల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు అధికార పార్టీ పంచాయితీ నుండి పార్లమెంటు వరకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రాతినిత్యం వహిస్తున్నా కమీషన్లు, కలెక్షన్లకే వారి సమయం గడిచిపోతుందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో పాలకపక్షం పూర్తిగా విఫలమైందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, చొప్పదండి నియోజకవ్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే విపక్షలను కూడగట్టి పెద్దఎత్తున రైతులచే ఉద్యమాన్ని చేపడుతామని ఆమె హెచ్చరించారు. పంట పొలాలను పరిశీలించిన వారిలో టిడిపి బిసి సెల్ ఉపధ్యక్షుడు వైద భూపతి, గంగాధర, మల్యాల మండల శాఖ అధ్యక్షులు మల్కాపురం రాజేశం, బత్తిని శ్రీనివాస్, టిడిపి సీనియర్ నాయకులు దొంతి వేణుగోపాల్, శ్రీపతి రావు, పెర్క కిషన్, తిరుపతి గౌఢ్, పర్శరాములు, ఇనుగొండ సురేష్, రాములు, హన్మాండ్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.