కరీంనగర్

నిఘా నేత్రాలతో నేరాలను అరికట్టడం సులభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం, అక్టోబర్ 22: గ్రామాల్లోని ప్రధాన కూడలిల వద్ద, హైవే రోడ్ల వద్ద నిఘా నేత్రాలను ఆయా ప్రాంతాల వారు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరాలను అరికట్టడం మరింత సులభమైన మార్గమమని హుజూరాబాద్ రూరల్ సిఐ రవి కుమార్ అన్నారు. మండలంలోని కొత్తగట్టు గ్రామంలో ఏర్పాటు చేయబోయే సిసి కెమెరాలను, అదే విధంగా శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ పౌరుడు యూనిఫాం లేని పోలీస్‌గా భావించుకోవాలని, గ్రామాల్లో శాంతియుత వాతావరణంలో ఉండాలంటే ఇలాంటి నిఘా నేత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అన్ని వర్గాల వాణిజ్య, వ్యాపారులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ముందుకు వచ్చి పోటీపడి నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకొని వారి వారి గ్రామాలను అభివృద్ధి బాటలో పయనించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ర తిరుపతి, ఎంపిటిసి మల్లారెడ్డి, ఎస్‌ఐ ఎల్.శ్రీను, మాజీ ఆలయ కమిటి అధ్యక్షులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో గ్రంథాలయ సేవలు విస్తృతం
* జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు
చొప్పదండి, అక్టోబర్ 22: విద్యార్థులు గ్రామాల్లో ఎక్కువ పుస్తక పఠనం చేయాలంటే, గ్రంధాలయాలు అందుబాటులోకి రావల్సిన అవసరం ఉందని, పైగా గ్రామాల్లో ఉన్న గ్రంధాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని, గ్రామాల్లో గ్రంధాలయ సేవలను విస్తృతం చేసేందుకు కృషి చేస్తానని జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు ఆదివారం చొప్పదండి పట్టణంలో జడ్‌పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ఆరెల్లి చంద్రశేఖర్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు కొత్త గంగారెడ్డి, ఎంపిటిసి చీకట్ల రాజశేఖర్, మీడియాసెల్ కన్వీనర్ గొల్లపల్లి శ్రావణ్‌కుమార్‌లతో పాటు పలువురు ఘనంగా సన్మానించి సత్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతు విద్యార్థులకు మెరుగైన పుస్తకాలు పఠానానికి అందించేందుకు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తిని సంపత్, చీకట్ల కుమార్, వడ్లకొండ శ్రీనివాస్, అజ్జు, చీకట్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
విజ్ఞాన్ యూత్ స్వచ్ఛ భరత్
జమ్మికుంట, అక్టోబర్ 22: జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో అదివారం విజ్ఞన్ యుత్ అసోసియోషన్ అధ్వర్యంలో మరికి వాడలలో స్వచ్చ భరత్ నిర్వహించారు. కాలనీలోని డైనేజిలలో చెత్తచెదారం రోడ్డ్‌పై దమ్ము దూళి ,పిచ్చి మొక్కలు తొలిగించారు. దుర్గంధం వెద జల్లుతున్న మురికి వాడలను శుభ్రం చేశారు.స్థానికి జమ్మికుంట సి ఐ ప్రశాంత్‌రెడ్డి సామజిక సేవ పై చేస్తున్న స్పూర్తితో విజ్ఞన్ యుత్ అసోసియోషన్ సభ్యులు ,యువకులు స్వచ్చా భరత్ నిర్వహించినట్లు యువ నాయకుడు ఇమ్మడి సతీష్ తెలిపాడు. సమాజంలో మేము సైతం అంటు పోలీసులు చేస్తున్న సేవను స్పూర్తిగా తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలోధర్మారం మాజీ సర్పంచ్ అంజనేయులు ,పూదరి శివతో అసోసియోషన్ సభ్యులు పాల్గోన్నారు.