కరీంనగర్

అక్రమాలు నియంత్రించేందుకే చెక్‌పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల రూరల్, నవంబర్ 17: అక్రమాలను ముందస్తుగా నియత్రించేందుకే చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు జగిత్యాల ఎస్పీ అనంతశర్మ తెలిపారు. శుక్రవారం జగిత్యాల మండలం ధరూర్ గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఎస్పీ అనంతశర్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఇసుక రవాణా నియత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాహణ యజమానులు తమ వాహనాల ఆర్‌సి బుక్కు. డ్రైవింగ్ లైసన్స్‌లు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. అనంతరం రాకపోకల వాహనాలకు సంబంధించి పత్రాలను ఎస్పీ పరిశీలించారు. సిఐ శ్రీనివాస్ చౌదరి, రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్, రిజర్వ్ ఎస్సై నవీన్, సిబ్బంది ఉన్నారు.
అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు
* బీజేపీ అభివృద్ధి కమిటీ వైస్‌చైర్మన్ ఆంజనేయులు
తిమ్మాపూర్, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అక్రమాలకు పాల్పడూ ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ కో మల ఆంజనేయులు అన్నారు. శుక్రవారం మండలంలోని అల్గునూర్ గ్రామ శివారులో గల లక్ష్మీనర్సింహ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ మండల శాఖ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పిన కల్లబొల్లి మాటలను నమ్మి ఓట్లు వేసి గెలిపించారని, తెలంగాణ వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయామని ఆ రోపించారు. రైతుల రుణమాఫీ విషయంలో కూడా పూర్తిగా విఫలమయ్యాడని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నాడని అన్నారు. అటు కళాశాల యాజమాన్యంతో ఇటు కుటుంబ సభ్యులతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కళాశాల ఫీజు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు, ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని కళాశాల యా జమాన్యం చెబుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేసి విద్యార్థులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళితులకు 3ఎకరాల భూమి విషయంలో అల్గునూర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నం చేసుకొని మృతి చెందిన సంఘటన విదితమే. కాని మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు ఆదుకోలేదన్నారు. మృతుడి కుటుంబానికి 20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, గణపతి, రామిడి రాంరెడ్డి, అజిత్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు కేతిరెడ్డి అంజిరెడ్డి, గడ్డం అరుణ్, బేతి శ్రీనివాస్ రెడ్డి, పున్నం అంజయ్యతో పాటు వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.
కాన్పుకు వెళితే కడుపు‘కోత’!
* ప్రాణం మీదకు తెచ్చిన ప్రభుత్వం వైద్యం
* పసిగుడ్డు మృతి .. చావుబతుకుల నడుమ ఇద్దరు బాలింతలు
ఎల్లారెడ్డిపేట, నవంబర్ 17: ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కల్పించేందుకు సర్కారు పలు వినూత్న పథకాలకు శ్రీకారం చుడితే.. అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన వైద్యుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. ప్రసవాల సంఖ్యను పెంచే లక్ష్యంతో కేసీఆర్ కిట్టు పంపిణీ చేస్తున్నా.. దవాఖానాకు వచ్చే నిరుపేదలకు వైద్యం నామమాత్రమే అవుతోంది. కాన్పుకు వెళితే వైద్యుల అలసత్వం వల్ల ఇద్దరు బాలింతలకు కడుపు‘కోత’ మిగిలింది. పురిట్లోనే మగ శిశువు మృతిచెంది పుట్టెడు శోకాన్ని నింపింది. ప్రభుత్వం ప్రాణం మీదకు తెచ్చిం ది. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం, దుమాల గ్రామాలకు చెందిన ఇద్దరు బాలింతలు సబీయా, సుమలత చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. పరిస్థితి విషమించడంతో వారిని బంధువులు స్థానిక ఓ ప్రవేటు ఆసుపత్రికి తీసుకు వచ్చారు. బాధితుల కథనం మేరకు.. సింగారం, దుమాలలోని బాలింతలు సబీయా, సుమలతలు వారంరోజుల కిందట పురిటినొప్పులతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిల్లో చేరారు. సబీయా సాధారణకు ప్రసవం చేశారు. పుట్టిన మగ బిడ్డకు పురిటిలోనే చనిపోయాడు. సుమలతకు శస్త్ర చికిత్స చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలింతలిద్దరికీ కుట్లు వేయకపోవడంతో వారం రోజులుగా రక్తస్రావమవుతోంది. ఆసుపత్రులకు వెళితే వైద్యులు తమ తప్పెమీ లేదంటూ దురుసుగా సమాధానమిస్తున్నారని వాపోయారు. పరిస్థితి విషమించడంతో చేతులు ఎత్తేశారు. దాంతో బాలింతలను స్థానిక ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కాన్పు చేయడంలో అలసత్వం వహించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు ఖరీదైన వైద్యం అందించాలని బాధితులు సబియా, సుమలతలు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.