కరీంనగర్

నెరవేరని ప్రజల ఆకాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురుమామిడి, నవంబర్ 18: తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ, అనేకమైన అలుపెరుగని ఉద్యమాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి మూడున్నరేళ్లు కావస్తున్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఘెరంగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని సీపీఐ కార్యాయలంలో రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 22న కరీంనగర్ జిల్లా లో గంగాధరలో పోరుబాట యాత్ర ప్రవేశించి, రామడుగు, చొప్పదండి, మానకొండూర్, శంకరపట్నం మీదుగా జమ్మికుంటలో బహిరంగ సభ ఉంటుందని, 23న తిమ్మాపూర్ మీదుగా చిగురుమామిడిలో బహిరంగ సభ అనంతరం గనే్నరువరం నుంచి సిద్దిపేట జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. డిసెంబర్ 3న కరీంనగర్‌లో 50వేల మందితో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఇందులో 3వేల మంది ఎఐవైఎఫ్ ఎర్రచొక్కా దళం, 3 వేల మంది మహిళలు ఎర్ర చీరలు ధరించి బతుకమ్మ, కోలాటంతో సాంస్కృతిక కళా ప్రదర్శన ఉంటుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా నేతలు ఎలగందుల రాజయ్య, అందెస్వామి, కె.జైపాల్‌రెడ్డి, దుడ్డెల లక్ష్మీనారాయణ, గూడెం లక్ష్మీ, తదితరులున్నారు.
సమాజాన్ని సంస్కరించేందుకే పోరుబాట
జమ్మికుంట: రాష్ట్రం భౌగోళికంగానే ఏర్పాటు చేయబడినదని, తెలంగాణ సమాజాన్ని సంస్కరించడానికే సిపిఐ ఆధ్వర్యంలో పోరుబాట చేపడుతున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తె లంగాణలో పశ్నించే వ్యక్తులను అణగతొక్కుతూ, అభివృద్ధి చేస్తున్నామని ప్రభు త్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. మార్కెట్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, రైతులను విస్మరించి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పాటు త ర్వాత ఏ వర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. కులాలకు వల వేస్తూ మభ్యపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలను నయవంచకు గురౌతున్నారని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా వారికి వర్తింపజేయకుండా, ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నాయకత్వాన 11మంది బృందంతో అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 3 వరకు జిల్లాల్లో పోరుబాటను నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కర్ర బిక్షపతి, సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్, జిల్లాకార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, మండల నాయకులు రామ్మూర్తి, ఒల్లాల సాంబయ్య, రంజిత్, రాకేష్, రత్నాకర్, శివతోపాటు తదితరులు పాల్గొన్నారు.
కాలువలు కూల్చినా.. పట్టించుకోరా?
* అధికారుల నిర్లక్ష్యంపై ఆయకట్టు రైతుల ఆందోళన
జగిత్యాల రూరల్, నవంబర్ 18: ఎస్సారెస్పీ డి. 63 ప్రధాన కాలువను కూల్చి వేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆయకట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మిషన్ భగీరథ పనులలో చేపడుతున్న పైపు లైన్ నిర్మాణంలో భాగంగా తీసిన గుంతల మట్టిని పక్కనే గల ఎస్సారెస్పీ కాలువలో పోయడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఎస్సారెస్పీ డి. 63 ప్రధాన కాలువ గుండా వెళ్లే గ్రామాలైన ధరూర్. నర్సింగాపూర్, మోతె, తిమ్మాపూర్, లక్ష్మిపూర్ సమీప కాలువలో చెట్లు, మట్టిని వేస్తుండడంతో సాగు నీరు వెల్లే అవకాశం లేకుండా పనులు చేస్తున్నారని కొందరు రైతులు ఆరోపిస్తూ భగీరథ నిర్వహకులపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎస్సారెస్పీ అధికారులు అటు వైపు కనె్నత్తి చూడకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో ఆయకట్టు రైతులు నోట్లో మట్టి కొట్టి మిషన్ భగీరథ పనులను గుత్తదారు ఇష్టరాజ్యంగా నిర్వహిస్తున్నారు. రానున్న రబీ సీజన్‌లో పంటలు వేయనున్న రైతులకు కాలువ నీటిలో అడ్డంకులు ఏర్పడితే పంట నష్టపోయే అవకాశమున్న సంబంధిత ఎస్సారెస్పీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎస్సారెస్పీ అధికారులు మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి పంట కాలువలకు నష్టం జరుగకుండా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి రైతులు సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు.