కరీంనగర్

పాల రైతులకు లీటరుకు రూ.4 ప్రభుత్వ ప్రోత్సాహకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 18: జిల్లాలోని పాల ఉత్పత్తి చేసే రైతులందరికీ లీటరుకు రూ.4 చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకం అందించనున్నట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పాలపై 4రూపాయల నగదు ప్రోత్సాహకం పంపిణీపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 380 పాల ఉత్పత్తిదారుల సంఘాలుండగా, 26,272 మంది పాల రైతులు, ఉత్పత్తిదారులు ఉన్నారని, రోజుకు 52,384 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తూ సంఘాల ద్వారా కరీంనగర్ డెయిరీకి పంపిస్తున్నారని వివరించారు. రోజుకు రూ.4లక్షలకుపైగా పాల రైతులకు ప్రోత్సాహకం అందుతుందని, నెలకు రూ.60లక్షలకుపైగా రైతులకు ప్రోత్సాహకం అందుతుందని చెప్పారు. ఈ ప్రభుత్వ ప్రోత్సాహకంతో పాల రైతులు రెట్టింపు ఉత్సాహంతో జిల్లాలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. రైతులకు పాల నాలుగు రూపాయల ప్రోత్సాహకం బ్యాంకు ఖాతాల ద్వారా ఆన్‌లైన్లో చెల్లించుటకు వీలుగా గ్రామాల వారీగా, రైతుల వారీగా బ్యాంకు ఖాతాలో ఆధార్ నెంబర్‌తో సహా వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ .విక్రంకుమార్, టెక్నికల్ సూపర్‌వైజర్ డాక్టర్ రవికుమార్ , తదితరులు పాల్గొన్నారు.