కరీంనగర్

ఆపన్నహస్తం అందించండి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, నవంబర్ 19: నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణ్ కుమార్ అనే యువకుడు పులిపిరి వ్యాధితో బాధపడుతున్నాడు. మండల కేంద్రానికి చెందిన నిరుపేద యువకుడైన ఎల్లె శ్రావణ్ కుమార్‌కు మొఖం నిండా పులిపిరులు ఏర్పడి ఆ వ్యాధితో బాధపడుతూ జీవితం కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వం, దాతలు ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని పట్టణానికి చెందిన పద్మశాలీ సంఘం నాయకులు డాక్టర్ అయిల రమేష్, సాయిరి మహేందర్, ఆడెపు అంబదాసులు వేడుకుంటున్నారు. పట్టణంలోని గాంధినగర్‌కు చెందిన ఎల్లె భాగ్యలక్ష్మి-్భద్రయ్య దంపతుల ద్వితీయ కుమారుడు ఎల్లె శ్రావణ్ కుమార్‌కు పుట్టనప్పటి నుండి మొఖంపై నల్లని పులిపిరులు ఏర్పడ్డాయి. క్రమంగా అవి పెద్దగా పెరగడంతో ముక్కు నిండా కూడా పెద్ద గడ్డలుగా పెరుగుతున్నాయి. దీంతో శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని శ్రావణ్‌కుమార్ ఆవేదన వ్య క్తంచేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన భద్రయ్య కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వైద్యానికి దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు శ్రావణ్ కుమార్ వెళ్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో మందిని ఆదుకుంటున్నారని, తమ కుమారుడికి చికిత్స అందించి ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఇందిరా గాంధీ సేవలు మరువలేనివి
* పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం
వేములవాడ,నవంబర్ 19: బ్యాంకుల జాతీయకరణ ద్వారా ఆర్థిక ఫలాలను పేదవర్గాల ముంగిట్లోకి చేర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి దక్కుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నరు. ఇందిరా శతజయంతి సందర్భంగా ఆయన వేములవాడకు చేరుకొని ఎఎంసీ మాజీ చైర్మన్ మనోహర్‌రెడ్ది అంబెడ్కర్ విగ్రహాం వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా జయంతి వేడుకల్లో పాల్గోని కెక్ కట్ చేసి కార్యకర్తలు పంచారు.