కరీంనగర్

ఉత్తేజం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, డిసెంబర్ 14: ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా, విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు పాఠశాలలలో ఉత్తేజం పేరుతో సాయంత్రం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. గురువారం ధర్మపురి కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల బహిరంగ ప్రదేశంలో మద్యాహ్న భోజనాన్ని వండడం చూసి ఆగ్రహించారు. భోజన తయారీలో శుచి, శుభ్రత ముఖ్యమన్నారు. ఏజెన్సీపై చర్యకు, హెచ్‌ఎంకు సంజాయిషీ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. ఉన్నత పాఠశాల 9,10తరగతులలో విద్యార్థులతో మాట్లాడారు. శ్రద్ధతో, ఏకాగ్రతతో చదవాలని, అనుమానాలు ఎప్పటికపుడు నివృత్తి చేసుకోవాలన్నారు. పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు, మార్కుల ఆధారంగా గ్రూపులుగా విభజింజి, చదివిస్తున్నట్లు, విషయోపాధ్యాయులు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు, సబ్జెక్టు వారీగా ప్రశ్నపత్రాలు తయారు చేసి, అభ్యాసం చేయిస్తున్నట్లు, ఏతావాతా గత సంవత్సరం కన్నా మెరుగైన ఫలితాల సాధనకై ఉపాధ్యాయులు కృషి చేస్తున్నట్లు పాత్రికేయులకు వివరించారు. జిల్లాలో గత ఏడు 97.35శాతం ఫలితాలను సాధించి, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రమంలోనే ఈసారి అధిగమించే చర్యలు గైకొనడం జరుగుతున్నదని, వందశాతం ఉత్తీర్ణత సాధిస్తామని విషయోపాధ్యాయుల నుండి అండర్‌టేకింగ్ తీసుకుంటున్నట్లు వివరించారు. జగిత్యాల ఆర్డీఓ డాక్టర్ నరేందర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ధర్మపురి ఎంపీపీ మమతారావు, తహశీల్‌దార్ నవీన్‌కుమార్, ఇంచార్జి హెచ్‌ఎం మల్లేశం, ఉపాధ్యాయులు ఉన్నారు.

విడినూనెల అమ్మకాలు చేస్తే చర్య
* నూనె దుకాణాలపై దాడుల్లో జిల్లా ఆహార భద్రత అధికారి జి.రవీందర రావు
సిరిసిల్ల, డిసెంబర్ 14: రాష్ట్రంలో విడినూనెల విక్రయాలను ప్రభుత్వం నిషేధించినట్టు జిల్లా ఆహార భద్రత అధికారి జి.రవీందర్‌రావు హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన సిరిసిల్ల పట్టణంలోని పలు ఆయిల్ దుకాణాలు, ఆయిల్ స్టోర్స్, నూనె అమ్మకాల దుకాణాలలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీరామ ఆయిల్ షాపు, గాయత్రి, సాయి, జగదీశ్వర్, శ్రీనివాస, కవితా ఆయిల్ స్టోర్స్‌లలో తనిఖీలు నిర్వహించారు. విడి నూనెల అమ్మకాలను ప్రభుత్వం నిషేధించిందని, ఇందు కోసం ప్రభుత్వం ఆర్‌సి.నెం.514/ఎఫ్‌ఎస్ ఎస్-1/2015-2 తేది.23-03-2015 కమీషనర్ ఆఫ్ ఫుడ్ సేష్టే ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈమేరకు ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా విడి నూనెలు అమ్మిన పక్షంలో చట్ట రీత్యా కఠిన చర్యలు తప్పవన జిల్లా ఆహార భద్రత అధికారి రవీందర్‌రావు వెల్లడించారు.