కరీంనగర్

కాల్వ మరమ్మత్తులకు కదిలిన రైతాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, డిసెంబర్ 15: మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింది డిస్ట్రిబ్యూటరీ-53 ప్రధాన కాలువ నుండి బోలు చెరువుకు నీటిని చేర్చే 21ఎల్ ఉప కాలువను మరమ్మత్తు చేయడం కోసం కాల్వ అయకట్టు రైతులతో కలిసి ప్రభుత్వ నేతలు, జిల్లా ఉన్నతాధికారుల భాగస్వామ్యంతో శుక్రవారం చేపట్టిన శ్రమదానం ఉత్సాహం నింపింది. జడ్పీటీసీ బాదినేని రాజమణి, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్ చొరవతో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్ శరత్ సహకారంతో జరిగిన శ్రమదానంలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు. గోపులాపూర్ నుండి బోలిచెరువు వరకు ఆయకట్టు పరిధిలోని గోపులాపూర్, కమలాపూర్, రామయ్యపల్లె, మద్దునూరు, తిమ్మాపూర్, రాయపట్నం, బూరుగుపల్లె, నాగారం గ్రామాల రైతులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పలుగూ, పారా, తట్టా, బుట్టా చేత బూని శ్రమదానానికి నడుం బిగించారు. చీఫ్‌విప్ ఈశ్వర్, కలెక్టర్ శరత్, జగిత్యాల ఆర్డీవో నరేందర్, ఎంపీపీ మమతారావు, వైస్ ఎంపీపీ రాజేశ్, ధర్మపురి దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, నరేశ్, రైతు సమన్వయ సంఘం మండల అధ్యక్షుడు భీమయ్య, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం, సంబంధిత గ్రామాల సర్పంచులు, నాయకులు, రైతులు ఈ క్రతువులో భాగస్వాములైనారు. కాలువకు మరమ్మతులు వందలాది రైతులు తరలిరావడం అభినందనీయమని, వారి శ్రమదానానికి తోడు కలెక్టర్ శరత్ సహకారంతో మిషనరీ కోసం 5.60లక్షలు మంజూరయ్యాయని చీఫ్‌విప్ ఈశ్వర్ తెలిపారు. వేసవిలో జిల్లాలో అన్ని కాలువల మరమ్మత్తులు చేసేందుకు కృషి చేస్తామన్నారు. 25న శ్రీరాంసాగర్ నుండి విడుదల నీరు అందే వరకు 21ఎల్ మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
రైతుల శ్రమదానం ఆదర్శనీయం
రైతుల శ్రమదానం జిల్లాకే ఆదర్శనీయమని కలెక్టర్ శరత్ అన్నారు. చీఫ్‌విప్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం సత్ఫలితాన్ని అందించాలని ఆకాంక్షించారు.