కరీంనగర్

సామాజిక, రాజకీయ సాధికారితలో మహిళలు వెనుకంజే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జనవరి 18: మహిళలు ఆర్థిక సాధికారిత కొంత మేరకు సాధించినా సామాజిక, రాజకీయ సాధికారితల్లో వెనుబడి ఉన్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. గురువారం మహిళా చట్టాలపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాలులో రెండు రోజుల పాటు జరుగుతున్న మహిళా సదస్సులో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వెంకటరత్నం మాట్లాడుతూ రిజర్వేషన్లతో దక్కించుకున్న రాజకీయ సాధికారిత భర్తల చేతుల్లోనే నలిగి పోతున్నదని అన్నారు. ఇక చట్టాలు ఎన్ని ఉన్నా సామాజిక సాధికారిత సాధించలేకపోతున్నారని, ఫలితంగా మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళా ప్రజా ప్రతినిథులు రిజర్వేషన్ల ద్వారా పదవులు దక్కించుకున్నా వారి కుటుంబ సభ్యులే ఇళ్లలో ఫైళ్ళు చూస్తున్నారని, ఇది దారుణమని, దీని నుండి బయట పడిన నాడే పూర్తి స్థాయిలో మహిళలు రాజకీయ సాధికారిత సాధించినట్టు అవుతుందన్నారు. భారత దేశంలో స్వాతంత్రం వచ్చాక మహిళల అభివృద్ది, సంక్షేమం, భద్రత, రక్షణపై చాలా చట్టాలు వచ్చాయని, 2013లో నిర్భయ చట్టం వచ్చిందని, ఇంకా ప్రత్యేక చట్టాలు మహిళలకు అవసరం లేదని, కానీ ఉన్న చట్టాలు ఎంత వరకు వీరికి బాసటగా నిలిచాయన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, రీజనల్ కో ఆర్డినేటర్ గుగులోతు రేణ, ఎంపీపీ జూపెల్లి శ్రీలత, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి నిధుల దుర్వినియోగం చేసినవారిపై చర్యలు
* ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
సుల్తానాబాద్, జనవరి 18: సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తప్పవని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటి సమావేశం ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారించారు. అధికారులు ఎలాంటి రికార్డులు చూపెట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివరి వారంలోగా పూర్తి స్థాయిలో నిధులకు సంబంధించిన రికార్డులు చూపాలని, లేని పక్షంలో నిధులు దుర్వినియోగం చేసిన వారిపై జిల్లా వైద్యాధికారి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. నిధులకు సంబంధించి పక్కా లెక్కలు చూపించాలని, ఆసుపత్రి సామాగ్రి, పరికరాలు తదితర వస్తువులు లెక్కలు పక్కాగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. నిధుల దుర్వినియోగంపై కమీషనర్, కలెక్టర్‌కు నివేదికలు అందిస్తామని, వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పారుపెల్లి రాజేశ్వరి, జడ్పీటీసీ ఊట్ల రమ, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఎంపీటీసీ పల్లా సురేష్, నాయకులు బుర్ర శ్రీనివాస్, మొల్గూరి అంజయ్య, డిఎం అండ్ హెచ్‌ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటి డిఎం అండ్ హెచ్‌ఓ కృపాబాయి, డాక్టర్లు ప్రియాంక ప్రియదర్శిని, శ్రీరాంతో పాటు పలువురు ఉన్నారు.