కరీంనగర్

క్రీడలతో పోటీతత్వం అలవడుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జనవరి 18: క్రీడల వల్ల మానసికోల్లాసంతో పాటు పోటీ తత్వం అలవడుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కోన్నారు. పెద్దపల్లి జిల్లా ఆవిర్భావం తర్వాత పోలీసులు పలు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెన్ అండ్ ఉమెన్ మూడవ తెలంగాణ ఇంటర్ జిల్లాల వాలీబాల్ పోటీలను గురువారం రాత్రి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని, తన పేరుతో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలకు నగదు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోటీలలో గెలుపు, ఓటమిలు సహజమని, గెలిచినా, ఓడినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. ఓటమి వల్ల జీవతంలో ఎన్నో పాఠాలు నెర్చుకుంటామని, ఓటమి గెలుపుకు సంకేతమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని, పెద్దపల్లి ఏసీపీలు అపూర్వ రావు, హబీబ్ ఖాన్, సీఐ గోపతి నరేందర్, ఎంవిఐ అల్లె శ్రీనివాస్, నగర పంచాయితీ చైర్మన్ ఎలువాక రాజయ్య, ఎంపీపీ సందనవేన సునీత, వాలీబాల్ అసోసియేషన్ నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

రాయితీని రబీ సీజన్ నుండే అమలు చేయాలి
* జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
జగిత్యాల టౌన్, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి రాయితీని ఈరబీ సీజన్ 2017- 18 నుండే అమలు చేయాలని సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. వాణిజ్య పంటలైన పసుపు, మిర్చి కందిలతో పాటు 8 మాసాలపై బడి ఉండే పంటలన్నింటికి ఎకరాకు 8వేల రూపాయల చొప్పున పెట్టుబడి రాయితీని అందించాలని గురువారం సిఎం కేసిఆర్‌కు లేఖ రాసినట్లు జీవన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వాణీజ్య పంటలైన పసుపు, మిర్చి, కందిలాంటి పంటలను ఒక పంట కాలంగా పరిగణించి పెట్టుబడి రాయితీని ఎకరాకు 4వేలు మాత్రమే ఇస్తామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. పసుపు, మిర్చి పంటలలో అంతర పంటగా మొక్కజొన్న పంటలను తీస్తారని, ఏ పంటకు లేనంత ఈపంటలకు పెట్టుబడి ఎకరాకు లక్ష వరకు అవుతుందని అన్నారు. కౌలు రైతులకు కూడ పెట్టుబడి రాయితీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. వాస్తావానికి రైతులకు న్యాయం జరగాలంటే పెట్టుబడి రాయితీతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతులకు న్యాయం చేసినట్లు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర గిట్టుబాటు కాని పక్షంలో ప్రభుత్వం బోనస్ ద్వారా భర్తీ చేసి రైతు గిట్టుబాటు ధర పొందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వం ఈ రబీ సీజన్ నుండే పెట్టుబడి రాయితీ అందించి, వాణిజ్య పంటలైన పసుపు, మిర్చి, కంది, పత్తి పంటలకు పెట్టుబడి రాయితీ ఎకరాకు 8వేలు అందించి రైతులను ఆదుకోవాలని సిఎం కెసిఆర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలను కోరినట్లు ఆయన వెల్లడించారు.

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
* బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రోప్లేమింగ్ * పల్లెల్లో అభివృద్ధి పనులు భేష్
* ఎమ్మెల్యే పనితీరుపై ప్రశంసలు * శనిగరం ప్రాజెక్టు పనుల పరిశీలన

కోహెడ, జనవరి 18: మహిళలు ఆర్థికంగా ఉన్నతి సాధిస్తే సమాజం మరింత ముందుకెళ్తుందని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రోప్లేమింగ్ అభిప్రాయపడ్డారు. మండలంలోని శనిగరం, కోహెడ, మైసంపల్లి గ్రామాల్లో గురువారం ఆయన స్థానిక శాసనసభ్యుడు సతీష్ కుమార్‌తో కలిసి పర్యటించారు. ఎంపీపీ కార్యాలయంలో మండలంలో చేపట్టుతున్న అభివృద్ధి పనుల్ని సమీక్షించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్లు, విద్య, వైద్యం తదితర వౌలిక సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల్లో అక్షరాస్యత మరింతగా పెరగాల్సి ఉందన్నారు. మహిళల విద్యకై తానుసైతం కృషి సల్పుతున్నట్లు చెప్పారు. విద్య ద్వారా ఆర్థిక పురోగతి సాధ్యపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు గాను తాను హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకొని పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ పనితీరును శ్లాఘించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అమలుతీరును అభినందించారు. అంతకుముందు 23 కోట్ల వ్యయంతో శనిగరం ప్రాజెక్టు ఆధునీకీకరణ పనుల్ని పరిశీలించారు. ప్రాజెక్టులో మత్స్యకారులు చేపలు పట్టుతుండడంతో వీక్షించి ముచ్చపడ్డారు. మైసంపల్లిలో గండిపెల్లి, గౌరవెల్లి రిజర్వాయర్‌కు వరద నీరు చేరే ప్రధాన భూగర్భ కాలువలోకి దిగి పరిశీలించారు. ఈయన వెంట ఆయన వ్యక్తిగత కార్యదర్శి నళిని రఘురామన్, ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహశీల్దార్ శ్రీనివాస్, జెడ్పీటీసీ లక్ష్మణ్, ఎంపీపీ స్వామి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు పాల్గొన్నారు.
మహిళలు అభివృధ్ది చెందితే దేశ అభివృద్ధి
హుస్నాబాద్: మహిళలు అభివృద్ది చెందుతే దేశం అభివృద్ది చెందుతుందని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రోప్లేమింగ్ అన్నారు. గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నా పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. మండలంలోని మహ్మదాపూర్‌లో 3లక్షల78వేలతో చేపట్టిన మహాసముద్రం గండి పనులను పరిశీలించి అనంతరం హుస్నాబాద్ నగరపంచాయతీ కార్యాలయంలో పట్టణ పేదల నిర్ములణ మెప్‌మా స్వచ్చంద సంస్థ,మహిళ సంఘల ఆధ్వరంలో స్వయం ఉపాదితో తయారుచేసి గాజులు, బాలికల డ్రెస్స్‌లు,అల్లికలు,పోత దుస్తులు, మహిళలు పండించిన కూరగాయలు, అకు కూరలుచూసి అనందం వ్యక్తం చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ మహిళలు సమఖ్యంగా ఉండి అర్థికంగా ఎదిగి ముందుకు రావాలని కోరారు.మహిళ సంఘలు మహిళ బ్యాంకులు, వ్యాపారాలు స్వయంగా ఏర్పాటు చేసుకుని మరింత అభివృద్దిలోకి రావాలని కోరారు, ఈ కార్యక్రమంలో హైకమీషనర్ రాజకీయ అర్థిక సలహదారు నళినిరఘరామన్ , నగరపంచాయితీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపిపి మంగ, అర్డివో శంకర్‌కుమార్, నగరపంచాయతీ కమీషనర్‌కుమార స్వామి, కౌన్సిలర్స్ మహిళసంఘల నాయకురాల్లు, తదితరులు పాల్గొన్నారు.