కరీంనగర్

వడదెబ్బతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, ఏప్రిల్ 17: మండలంలోని అశిరెడ్డిపల్లికి చెందిన కురుకుంట్ల నర్సయ్య (62) అనే రైతు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. గ్రామస్థులు, కుటుంబ కథనం ప్రకారం.. నర్సయ్య శనివారం పొలం వద్దకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనం చేసి పడుకున్నారు. అర్ధరాత్రి తీవ్ర అవస్థకు గురికాగా స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్ వద్ద ప్రథమ చికిత్స చేయించి వేములవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య నర్సవ్వ, ఇద్దరూ కుమార్తెలున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కట్కూరి చంద్రయ్య కోరారు.

మానకొండూర్ మండల పరిధిలో..
మానకొండూర్: మండల పరిధిలోని వెల్ది గ్రామానికి చెందిన రామగిరి నర్సయ్య(49) అనే రైతు వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నర్సయ్య బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి తీవ్రమైన ఎండలో ఇంటికి చేరుకున్న నర్సయ్య ఎండదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నర్సయ్య ఒక్కగానొక కూతురు అనూషకు 13 రోజుల క్రితమే పెళ్లి జరిగింది. కూతురుకు పెళ్లి చేసిన కొద్ది రోజులోనే తండ్రి నర్సయ్య మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది.