కరీంనగర్

లంబాడీల అభివృద్ధికి సేవాలాల్ మహారాజ్ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 15: గొప్ప సేవాతత్వం గల లంబాడీల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ లంబాడీలను ఐక్యం చేసి వారి అభివృద్ధికి కృషిచేసిన గొప్ప మహనీయుడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో సంత్ సేవాలాల్ మహారాజ్ 279వ జయంతి ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో లంబాడీల పాత్ర మరువలేనివని అన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా లంబాడీల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. ఎవరికి తలవంచకుండా సమాజంలో ఆత్మగౌరవంతో బతికిన వ్యక్తి సేవాలాల్ మహారాజ్ అని, ఐక్యత, ధర్మం, న్యాయం పట్ల అకుంటిత దీక్షాదక్షితలు ఉండాలని బోధించేవారని కొనియాడారు. సమాజంలో అణచివేయబడిన జాతిబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని, అందులో భాగంగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.75,116 ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో చేపట్టిన తండా నిద్ర కార్యక్రమంలో భాగంగా తండాలో ఇల్లు కాలిపోయి రెండు పెళ్లీళ్లు ఆగిపోయాయని తెలుసుకొని ఈ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్రంలో 500లకుపైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్టమ్రని చెప్పారు. పేద కుటుంబాల పిల్లలు ఇతర దేశాల్లో పైచదువుల కోసం వెళ్లేందుకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. తండాలలో విద్యుత్ బిల్లులను రద్దు చేశామని తెలిపారు. మరెన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల సంక్షేమానికి ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని, సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా? లేదా? అనేది ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. ఉజ్వల పార్కు వద్ద గిరిజన భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజంలో అందరు సమానంగా జీవించాలని ఆశించిన గొప్ప మహనీయుడని తెలిపారు. మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా అందరు ముందుకుసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అశోక్ కుమార్, కార్పొరేటర్లు రూప్‌సింగ్, సునీల్‌రావు, గిరిజన నాయకులు తిరుపతి నాయక్, భీమా సాహెబ్, రాందాస్ నాయక్, కిషన్ నాయక్, మహేష్ నాయక్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.