కరీంనగర్

చెక్ డ్యాంతో నీటి వనరుల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెడ, ఫిబ్రవరి 18: చెక్ డ్యాంల నిర్మాణంతో నీటి వనరులను పెంపు చేసుకోవచ్చునని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని గుండారెడ్డిపల్లిలో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనుల్ని ఆయన ఆదివారం సందర్శించి పరిశీలించారు. వర్షపునీరును నిలువ చేయడంతో భూ గర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మాణాలకు సైతం ప్రాధాన్యతనిస్తుందని, ముఖ్యంగా గుట్టల ప్రాంతాల్లోని పల్లపు భూముల్లో వర్షపు నీటిని నిలువ చేయటానికి గాను అవసరమున్నచోట ఈ చెక్ డ్యాంలను నిర్మిస్తున్నామని నియోజకవర్గంలో ఇటీవల 20 చెక్ డ్యాం నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని, పరిపాలనాపరమైన అనుమతులు, నిధులు మంజూరైన వెంటనే పనుల్ని ప్రారంభిస్తామని తెలిపారు. మండలంలోని గుండారెడ్డిపల్లిలో గుట్టల ప్రాంతం కావడం వల్ల చెక్ డ్యాం నిర్మాణాలతో రైతన్నలకు మేలు చేకూరుతుందని తెలిపారు. అనంతరం గ్రామంలో బాల వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వింజపెల్లి గ్రామంలో జరిగిన టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ స్వామీ, జెడ్పీటీసీ లక్ష్మణ్, విండో చైర్మన్ శ్రీహరి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన టీఅర్‌ఎస్ నాయకులు
జమ్మికుంట, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను, జమ్మికుంట టిఅర్‌ఎస్ నాయకులు దేశిని కోటి అధ్వర్యంలో అదివారం సందర్శించారు.ఈ సందర్బంగా దేశిని కోటి మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం వ్యవసాయనికి రెండు పంటలకు నిరంతరం సాగు నీటిని అందించేందుకు అన్ని తానై కృషి చేస్తున్న కెసిఅర్‌కు ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం చేసేందుకు కెసిఅర్ ప్రభుత్వం అద్బుతమైన ప్రాజెక్లు నిర్మాణం చేపడుతున్నారన్నారు.సమయనుకులాంగా శరవేగంగా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని అనందం వ్యక్తం చేశారు. దేశంలోనే రైతంగాన్ని అదుకునేందుకు చేస్తున్న,గోప్ప ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిపోతుందన్నారు.ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ సర్పంచ్ సుభద్ర అంజేనేయులు, యంపిటిసి సంగీత వీరన్న, సదానందం,సాంబముర్తి, మధు పాల్గొన్నారు.