కరీంనగర్

శివారు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 18: శివారు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఆదివారం 49వ డివిజన్ పరిధిలోని హిందుపురి కాలనీలో రూ.50లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో శివారు కాలనీలు అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రతీ ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే 49వ డివజన్‌కు అత్యదికంగా రూ.5.75 కోట్లు కేటాయించడం జరిగిందని, వాటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఈ డివిజన్‌లోని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. మరిన్ని నిధులు కేటాయించి అభివృద్దికి సహకారాన్ని అందిస్తానని, మరో మూడు నెలల్లో ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి చేసి కరీంనగర్ రూపురేఖలు మార్చుతామని చెప్పారు. నగరంలోని అన్ని డివిజన్‌లను పార్టీలకతీతంగా అభివృద్ధి చేసి చూపుతామని, రోడ్ల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధితోపాటు సంక్షేమం, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ గుగ్గిల్లపు రమేష్, కార్పోరేటర్లు బత్తుల భాగ్యలక్ష్మి, బోనాల శ్రీకాంత్, బండారి వేణు, కర్రె లింగయ్య, నాయకులు కొండపల్లి సతీష్, ఎడ్ల అశోక్, దామోదర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజిరెడ్డి, సల్వాజి రమణారావు, ఉప్పు అనీల్, రఘుపతి రెడ్డి, తిరునగరి రవీందర్‌తోపాటు కాలనీవాసులు పాల్గొన్నారు.