కరీంనగర్

సంక్షేమంలో మహిళలకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, ఫిబ్రవరి 20: టి ఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్‌లో మంగళవారం మహిళలకు మంత్రి ఈటల దీపం కనెక్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసూతి మహిళలకు కేసీఆర్ కిట్, ఆడ పిల్లల వివాహాలకు షాదీ ముబాకర్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దని అన్నారు. మహిళలకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ప్రతి పేద మహిళకు గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని, వీటిని మహిళలు ఉపయోగించుకోవాలన్నారు. మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకుని వాగులు, చెలిమెల వైపుకు పోవద్దనే ఉద్దేశంతోనే ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బాలికల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించామని తెలిపారు. ఆశ వర్కర్లకు, హోంగార్డులకు వేతనాలు పెంచామని, మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు వంటివి కల్పించామన్నారు. మహిళలకు రక్షణ కోసం షీటీంలకు ప్రవేశపెట్టామని, మహిళలకు అన్ని రకాల అవకాశాలు తమ ప్రభుత్వం కల్పిస్తోంని, బతుకమ్మ వంటి పండుగలకు గుర్తింపు తెచ్చామని వివరించారు. దేశం అంతా తెలంగాణ వైపు చూసే పరిస్థితి వచ్చిందని, ఇది కె సి ఆర్ ఘనత అని అన్నారు. రాబోయే కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వొడితల సరోజినిదేవి, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, జెడ్పీటీసీ సరోజన, నగర పంచాయతీ ఛైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ పివి మదన్‌మోహన్, టి ఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అక్రమ లేఅవుట్లపై అధికారుల కొరడా
* వెంచర్లలో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లు తొలగింపు * అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు తప్పవు:డీపీవో హెచ్చరిక

పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 20: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి అనుకొని ఉన్న గ్రామాల్లో గల వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన అక్రమ లేవుట్లపై అధికారులు కొరడా ఝళిపించారు. మండలంలోని పెద్దకల్వల, పెద్దబొంకూర్, రంగంపల్లి గ్రామ శివారులో లేఅవుట్ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లను జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్ ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు. అక్రమ లేఅవుట్లలో ఏర్పాటు చేసిన ప్లాట్ల హద్దు రాళ్లను అధికారులు తొలగించారు. పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భావం తర్వాత జిల్లా కేంద్రం పరిసర గ్రామాల్లో రాజీవ్ రహదారి అనుకొని ఉన్న ప్రాంతాల్లో రియల్ దందా జోరుగా కొనసాగుతోంది. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటు చేసి, ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం నాళా పన్ను చెల్లించక పోవడంతో పాటు లేఅవుట్ అనుమతి లేకుండానే ప్లాట్ల అమ్మకాలు చేపడతున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు పక్కా నిర్మాణాలు చేపట్టే సందర్భంలో కొనుగోలు చేసిన వారు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరస్థితి ఏర్పడుతోంది. ఈ విషయమై అధికారులు పలు మార్లు హెచ్చరించినా, హద్దు రాళ్లు తొలగించినా తత్కాలికంగా బ్రేకు పడినా మళ్లీ కథ మొదటికి వస్తోంది. ఇటీవల పెద్దకల్వల గ్రామ సమీపంలో గల ఎస్సారెస్పీ క్యాంపులో జిల్లా కలెక్టరేట్ సముదాయ భవన నిర్మాణం ప్రారంభమైంది. దీనితో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో రియల్ దందా జోరుగా సాగుతోంది. దీనితో అధికారులు దృష్టి సారించి రియల్ దందాకు చెక్ పెట్టే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్ మాట్లాడుతూ అక్రమ లేవుట్లలో ప్లాట్ల అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే కొనుగోలు దారులు కూడా అన్ని రకాల అనుమతులు కలిగిన ప్లాట్లను కొనుగోలు చేయాలని సూచించారు. దీని వల్ల నిర్మాణ సమయంలో అనుమతుల కోసం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయితీ కార్యదర్శులు సతీష్ రెడ్డి, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.