క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, మార్చి 20: వివాహం జరిగి నాలుగు నెలలు కాకముందే ఓ నవవధువు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం రాగుల వినిత (22) ఇదే గ్రామానికి చెందిన యువకునితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. గత కొద్ది రోజుల నుండి మృతురాలికి పీడ కళలు వస్తున్నాయని, ఎవరో చేతబడి చేశారనే అనుమానంతో పలు ఆసుపత్రుల్లో చూపించారు. అయినప్పటికీ ఫలితం లేకపోగా తీవ్ర మనస్థాపానికి గురైన వినిత ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి నాగుల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.