క్రైమ్/లీగల్

13 మంది మందు బాబులకు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 6: మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో 13 మంది మందు బాబులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. కరీంనగర్‌కు చెందిన బజారు దామోదర్, ఎల్లారెడ్డిపేటకు చెందిన గుగులోతు అంతులాల్‌లకు ఐదు రోజులు, కరీంనగర్‌కు చెందిన కొడిదెల యాకయ్యకు మూడు రోజులు, తమ్మిశెట్టి వెంకటరత్నంకు రెండు రోజులు, యాదగిరి సతీష్, సంజనపు నాగభూషణం, కె.రాజ్‌కుమార్, నిఠాయి బరాయి, అలకుంట్ల తిరుపతిలకు ఒక రోజు జైలుశిక్ష, జరిమానా విధించారు. మరో నలుగురికి జరిమానా విధించారు. 13 మంది మందుబాబులకు రూ.37,100 జరిమానా విధించారు.