క్రైమ్/లీగల్

దేవునిపల్లి క్వారీపై టాస్క్ఫోర్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, మే 17: మండలంలోని అందుగులపల్లి గ్రామ పరిధిలోని దేవనిపల్లి గ్రామ సమీపంలో గల క్యారీపై గురువారం రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా క్వారీ వద్ద అక్రంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు క్వారీ నిర్వాహకులు రాయిశెట్టి శ్రీనివాస్, చిట్యాల అశోక్, కాంప్రెషర్ యజమాని సంచుల సధాకర్‌లను అరెస్టు చేసి బసంతనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ దాడులలో 321 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 39 స్లార్రీ, 179 కిలోల అమ్మోనియం బస్తాలు, 50 లీటర్ల కిరోసీన్, ఒక కంప్రషర్ ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ సీఐ సరిలాల్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిథిలో అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు టాస్క్ ఫోర్స్ ఎసీపీ విజయ సారథి ఆధ్వర్యంలో నిత్యం దాడులకు చేపడుతున్నామని, ఇలాంటి అక్రమ కార్యాకలాపాలు ఎక్కడ జరిగిన తమకు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీససుకుంటామని సీఐ సరిలాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఎ ఎస్సై స్వామి, సిబ్బంది సదానందం గౌడ్, నిజాంపేట శేఖర్, రవకుమార్, సదానందం, చంద్రశేఖర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బతో ఇద్దరు మృతి
ఇబ్రహీంపట్నం, మే 17: మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర చిన్నదేవయ్య (40) అనే గొర్రెల కాపరి గురువారం వడదెబ్బతో మృతి చెందారు. మృతుడు 10గంటలకు గొర్రెలను మేపడానికి తీసుకెళ్లి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఇంటికి తీసుకువస్తుండగా మృతిచెందిన ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.

వృద్ధురాలు మృతి
మానకొండూర్: మానకొండూర్ మండల పరిధిలోని శ్రీనివాస్‌నగర్ గ్రామంలోమామిండ్ల లచ్చమ్మ(70) అనే వృద్ధిరాలువడదబ్బెతో మృతి చెందినట్లు గ్రామస్థులు గురువారం తెలపారు. మృతురాలు లచ్చమ్మ సోమవారం మధ్యాహ్నాం ఎండలోతిరగడం వలన ఎండదెబ్బకు గురైంది దీంతో రాత్రి అస్వస్థకు గురి మృతి చెందినట్లు తెలిపారు. వడదెబ్బతో మృతి చెందిన మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా అదుకోవాలని సర్పంచ్ ఎరుకల బాగ్య-శ్రీనివాస్, గ్రామస్థులు కోరారు.