కరీంనగర్

బదిలీలు, పదోన్నతులు ఒకేసారి చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 20: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు ఒకేసారి చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లాల లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నగరంలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎం.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో పదోన్నతులు కల్పించకుండా, కేవలం బదిలీల ప్రక్రియ మాత్రమే చేపడితే, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వెబ్ కౌనె్సలింగ్ పట్ల టీచర్లలో పలు అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయని, 2015లో నిర్వహించిన మాదిరిగానే ఈసారి కూడా మాన్యువల్ కౌనె్సలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక పాఠశాలలో ఐదేళ్ళు పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ళు నిండిన టీచర్లను మాత్రమే నిర్బంధ బదిలీ చేయాలన్నారు. కొత్త పింఛన్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కల్గిస్తున్న నేపథ్యంలో సిపిఎస్ విధానాన్ని సత్వరమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 398 వేతనంపై పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారాన్ని ఎక్కువ చూపి, ముఖ్యమంత్రిని అధికారులు తప్పుదోవ పట్టించారని విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా 7వేల పైచిలుకు ఉన్న స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. 2003 డీఎస్సీలో ఎంపికైన టీచర్లకు పాత పింఛన్ పథకం వర్తింపజేయాలన్నారు. హెల్త్‌కార్డుల కోసం ప్రతినెల రూ.300నుంచి రూ.600 వరకు ప్రీమియం చెల్లించేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. హెల్త్‌కార్డులపై కార్పోరేట్ ఆస్పత్రులు వైద్యచికిత్సలు చేసేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలన్నారు. రిటైరైన భాషాపండితులు, ఎయిడెడ్ టీచర్ల నుంచి లక్షలాది రూపాయల రికవరీని ముఖ్యమంత్రి హామీ మేరకు వెంటనే నిలిపేయాలన్నారు. అంతకుముందు జిల్లాశాఖ నూతన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. అధ్యక్షునిగా ఎం.ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యక్షునిగా కె.రవికుమార్, పి.జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా ఆర్.రమణారెడ్డి, కార్యదర్శులుగా జె.నర్సింహస్వామి, ఎం.రామస్వామి, డి.ప్రేమ్‌సాగర్, ఎల్.శాంతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎ.రాజయ్య, ఎం.అమరెందర్‌రెడ్డి, ఎ.వెంకటరమణతో పాటు జిల్లా నలుమూలలనుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.