కరీంనగర్

తప్పులుంటే వెంటనే సరిచేసి పంపిణీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 25: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతులకు పంపిణీ చేసే పట్టాదార్ పాసు పుస్తకాలలో తప్పులుంటే వెంటనే సరి చేసి తిరిగి ప్రింటింగ్ చేయించి కొత్త పట్టాదార్ పాసు పుస్తకాలు జారీ చేయాలని కరీంనగర్ పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీ ప్రత్యేక పర్యవేక్షణాధికారిణి, ముఖ్య మంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీపై అదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,29,662 ఖాతాలు ఉన్నాయని వివరించారు. జిల్లాలో ఆధార్ అనుసంధానం కాని 4,558 మంది ఆధార్ కార్డులను అనుసంధానం చేసి పాసు పుస్తకాలు ప్రింటింగ్ చేయించాలని, ఇతర గ్రామాలలో ఉన్న రైతులను పిలిపించి పాసు పుస్తకాలను అందించాలని ఆదేశించారు. గ్రామాలలో రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పట్టాదారు పాసు పుస్తకాలలో ఫొటో, ఆధార్, సర్వే నెంబర్లు, విస్తీర్ణం తదితర అంశాలు తప్పుగా నమోదైతే వాటిని గుర్తించి కొత్త పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామాలలో పుస్తకాల పంపిణీ పూర్తి చేయకపోతే సంబంధిత తహశీల్దారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, ఆర్‌డిఓ ఆయేషా మస్రత్ తదితరులు పాల్గొన్నారు.