కరీంనగర్

ప్రాణం బలిగొన్న ‘స్థల వివాదం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంగళ్ళపల్లి, జూన్ 16: తంగళ్ళపల్లి మండలం రామన్నపల్లె గ్రామంలో భూ వివాదం శనివారం ఒకరి హత్యకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రామన్నపల్లెలో పక్కపక్కనే నివాసముండే సల్లారపు సత్తిరెడ్డి, సల్లారపు రాంరెడ్డిలు దాయాదులు కాగా ఇరువురికి వ్యవసాయ భూమికి సంబందించిన వివాదం గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఇటీవలి కాలంలో సల్లారపు సత్తిరెడ్డికి సంబంధించిన స్థలాన్ని రాంరెడ్డి ఆక్రమించి వంటశాల, సెప్టిక్ ట్యాంకును నిర్మించుకున్నాడు. అడ్డువచ్చిన సత్తిరెడ్డి కుటుంబాన్ని చంపుతానని బెదిరించడంతో పెద్ద మనుషులను ఆశ్రయించగా పంచాయితీ నిర్వహించి ఇరువురికి సర్దిచెప్పారు. కబ్జా చేసిన స్థల వివాదం కొనసాగుతుండగా రాంరెడ్డి శనివారం మరింత స్థలాన్ని కబ్జా చేసేందుకు నిర్మాణ పనులు చేపట్టడంతో సత్తిరెడ్డి అతని భార్య సులోచన కోడలు రజితలు అడ్డుకున్నారు. దానితో ఆగ్రహనికి గురైన సల్లారపు రాంరెడ్డి అతని కుటుంబ సభ్యులు గొడ్డలి, కర్రలతో సత్తిరెడ్డి కుటుంబంపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. గొడ్డలి దాడిలో సత్తిరెడ్డి మెడకు తీవ్రగాయం కాగా సులోచనలకు తలపై గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో సల్లారపు సత్తిరెడ్డి (55) పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు తెలిపారు. భర్త చనిపోయినట్టు తెలియని సులోచన (49) సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భూ వివాదం ఘటనను తీవ్రంగా తీసుకున్న జిల్లా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏఎస్పీ రవీందర్, సిరిసిల్ల రూరల్ సీఐ అనిల్ కుమార్, తంగళ్ళపల్లి ఎస్సై మారుతీలు జిల్లా ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తు పరిస్థితిని సమీక్షించారు. నిందుతులు పరారీలో ఉన్నారని వారిని వీలైనంత తొందరగా పట్టుకుంటామని తంగళ్ళపల్లి ఎస్సై మారుతీ తెలిపారు.