కరీంనగర్

కేంద్ర పథకాల అమలుకు రాష్ట్రప్రభుత్వమే అడ్డంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 18: ప్రజాసంక్షేమమే పరమావధిగా భావిస్తున్న కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అనేక పథకాలు తెలంగాణలో అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డంకిగా మారుతోందని బీజేపీ అనుబంధ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు ఆరోపించారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల అమలులోవైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మోకాలడ్డుతున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి 40వేల ఇళ్ళు మంజూరైతే వాటిని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కిందికి మార్చినట్లు, పంట నష్టపోతున్న రైతాంగానికి ధీమా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని కూడా అమలు చేయకపోవటంతో, రాష్ట్రంలో లక్షలాది మంది పంట నష్టపోయిన రైతులు బీమాకు నోచుకోలేని దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని దుయ్యబట్టారు. ఇన్‌పుట్ సబ్సీడీ మంజూరీ కోసం పంట నష్టపోయిన రైతుల జాబితాలు కూడా ఇప్పటివరకు కేంద్రానికి పంపకుండా జాప్యాన్ని ప్రదర్శిస్తోందని ద్వజమెత్తారు. రైతుబంధుతో రైతులకు ఒరిగిందేమి లేదని, ఈ పథకం ఎవరికి లబ్ది చేకూర్చుతుందో రైతాంగం గమనిస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల రిడిజైనింగ్ పేర సాధించిందేమి లేదని, అంచనాల వ్యయం పెంచి తమ కమీషన్లు మెరుగు పర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రైతాంగ సంక్షేమంలో తమ ప్రభుత్వమే ముందున్నట్లు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఉద్యోగులను మభ్యపెట్టేందుకే జోనల్ వ్యవస్థను తెరమీదకు తెచ్చాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, నాలుగేళ్ళగా కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలు ఇంటింటికి చేరవేసేందుకు విశేష్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రతి వ్యక్తిని కలవనున్నట్లు వెల్లడించారు. కపట బుద్దిని వీడని కాంగ్రెస్ తెరాసతో అంతర్గత సంబంధాలున్నాయనటం పిచ్చి ప్రేలాపనలు మాత్రమేనని అన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ చేస్తున్న అభివృద్ధిపనులతోకాంగ్రెస్ పని ఖతమైందన్నారు. రాబోయే 2019లో తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా మారబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈసమావేశంలో ఆపార్టీ నాయకులు ప్రశాంత్‌రెడ్డి, కనె్నబోయిన ఓదెలు, తాళ్ళపల్లి హరికుమార్‌గౌడ్, ఊరడి శివారెడ్డి, ఎంపీటీసీ శివకుమార్, భాషవేని మల్లేశంయాదవ్, ఉదారపు మారుతి, ఎల్.శంకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.