కరీంనగర్

రైతు బీమా అమలులో కీలకపాత్ర ఏఈఓలదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు బీమా పథకం అమలులో ఏఈఓలదే కీలకపాత్ర అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీమా ఫారాలను పూరించేటప్పుడు ఏలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తగా పూరించాలని ఆదేశించారు. రైతు సూచించిన పేరును నామిని కాలంలో రాయాలని తెలిపారు. సోమవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులకు రైతు బీమా పథకంపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సు అనంతరం వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులతో మంత్రి పోచారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విస్తరణాధికారులు గ్రామాల్లో టాంటాం వేయించి, షెడ్యూల్ ప్రకారం గ్రామాలకు వెళ్లి పథకం విజయవంతానికి కృషిచేయాలని సూచించారు. 18 నుంచి 60యేళ్లలోపు రైతులందరు అర్హులేనని, పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులను వందశాతం పథకంలో చేర్చించే బాధ్యత ఏఈఓలదేనని అన్నారు. సమన్వయ సమితి సభ్యుల సహకారం తీసుకుంటూ ముందుకుసాగాలని సూచించారు. ఇంటింటి వెళ్లి భీమా ఫారాలను పూరించి ఈ నెల 30లోగా ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. భీమా ఫారాలను పూరించే సమయాల్లో నిర్లక్ష్యం, పొరపాట్లు జరగవద్దని, జరిగితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏఓలు, డీఏఓలు, జేఏఓలు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రైతు మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి పరిహారం త్వరగా చెక్కు అందేలా చూడాల్సిన బాధ్యత కూడా ఏఈఓలపైనే ఉందని అన్నారు. బీమా అమలుతోపాటు లాభసాటి సాగు చేసేవిధంగా ఎప్పటికప్పుడు రైతులను మోటివేటివ్ చేయాలని తెలిపారు. సుమారు అరగంట పాటు నిర్వహించిన ఈ సమావేశంలో బీమా పథకంలోని నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ అధికారులకు మంత్రి క్లుప్తంగా వివరించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రైతు సమన్వయ సమితి రాష్ట్ధ్య్రాక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు కమలాకర్, విద్యాసాగర్‌రావు, సత్యనారాయణ, శోభ, మధు, సతీష్‌కుమార్, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ కృష్ణ్భాస్కర్, పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, సుడా చైర్మన్ రామకృష్ణారావు, రైతు సమన్వయ సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు నర్సయ్యలతోపాటు మండల, గ్రామ రైతు సమన్వయ సమితి సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.