కరీంనగర్

పనుల్లో నాణ్యత తప్పనిసరి : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, జూన్ 21: హుస్నాబాద్ మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పని సరిని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డి అన్నారు. గురువారం హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అభివృద్ధి పనులపై నగరపంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రమ్మ, ఆర్‌డీవో శంకర్, నగర కమిషనర్ రాజమల్లయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వార్డుల వారిగా అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనుకున్న సమయానికి పనులు చేయని కంట్రాక్టన్‌లపై చర్యలు తప్పవరి హెచ్చరించారు. జూలై 15వ తేదీ లోపు పనులను మున్సిపల్ అధికారులు దగ్గర పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యతపై అకస్మిక తనీకులు చేస్తామని పనుల్లో ఎలాంటి పొరపాట్లు జరిగితే సంబందిత కంట్రాక్టర్‌ను టర్మినేట్ చేస్తామన్నారు. ఈ మేరకు లక్ష్మీనారాయణ అనే కాంట్రాక్టర్‌ను టర్మినేట్ చేస్తూ అతని టెండర్‌లను రద్దు చేయాలని ఉమ్మడి జిల్లా పబ్లిక్ హెల్త్ ఈఈ వీర ప్రతాప్‌ను ఆదేశించారు. 16వ వార్డులో ప్రత్యేక నిధులతో చేపడుతున్న పనులపై ఆరాదిస్తు స్థల వివాద విషయంపై పూర్తిస్థాయిలో పరీశిలించి అక్కడి పనుల వివరాలను అప్‌డేట్ చేయాలని ఆర్‌డీవో, ఈఈ, తహశీల్దార్, మున్సిపల్ కమీషనర్ అండ్ చైర్మన్ వెళ్లి సమస్యను పరిష్కారించాలన్నారు. మండలంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులపై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జూలై 10 లోపు పనులు చేయకపొతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్యరించారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్‌ల నిర్మాణాలపై క్షేత్ర స్థాయిలో అధికారులతో సమీక్షీంచారు. ప్రభుత్వము చేపడుతున్న ప్రతి పని డబ్బుతో కూడుకున్నదని కంట్రాక్టర్‌లు నాణ్యతతో శ్రద్ధగా పని చేయాలని నాణ్యతలు కాంట్రాక్టర్‌లను తొలంగిచాలని ఈఈ శ్రీనివాసచారిని ఆదేశించారు. సమావేశంలో ఎంపీపీ మంగతో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.