కరీంనగర్

ఆర్ట్స్ కాలేజీ పునర్నిర్మించకపోతే ఉద్యమం ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 20: కూల్చిన చోటనే ఆర్ట్స్ కళాశాల నూతన భవనం నిర్మించకపోతే అఖిల పక్షాల ఉద్యమ దెబ్బ తప్పదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు డా.కె.నగేశ్ హెచ్చరించారు. స్మార్ట్ పార్క్ పేర ఆర్ట్స్ కళాశాల కూల్చివేయడాన్ని నిరసిస్తూ, శుక్రవారం బల్ధియా ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ప్రధాన ద్వారం ఎదుట రెండు గంటలకు పైగా బైఠాయించి, ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, చారిత్రాత్మక ఆర్ట్స్ కళాశాలను కూల్చివేయటంపై గత 45రోజులుగా తీవ్రస్థాయిలో ఆందోళనలు, పోరాటాలు చేస్తున్న అఖిలపక్షాల ఉద్యమాలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాల నిర్మిస్తామంటూ హామీ ఇచ్చిందని, కళాశాల ప్రతిపాదిత స్థలానికి కొంతభాగం కేటాయించిందన్నారు. వారం రోజుల్లోపు కళాశాల నిర్మాణ పనులు చేపట్టకపోతే, ఈనెల 30న నగరన బంద్‌కు పిలుపునిస్తామని స్పష్టం చేశారు. నగరవాసులు సహకరించి, తమ నిరసన బహిర్గతం చేయాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న 750మందికి పైగా విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు, ఆధునిక హంగులతో కూడిన కళాశాల నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎంపి వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లు కుమ్ముక్కై నగరాన్ని సంయుక్తంగా దోచుకునేందుకు రూపొందించిన పక్కా ప్రణాళికలోభాగమే ఆర్ట్స్ కళాశాల కూల్చివేయటమన్నారు. పార్కు పేర ఓపెన్ థియేటర్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి వందేళ్ళ లీజుకు తీసుకుని, అధికారికంగా కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళే యత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు చేసిన నినాదాలతో డిప్యూటీ కమీషనర్ గౌతంరెడ్డి ఆందోళన స్థలానికి వచ్చి, వినతిపత్రం స్వీకరించారు. ఈ ముట్టడిలోఅఖిలపక్ష నాయకులు సీపీఐ పైడిపల్లి రాజు, సీపీఎం గుడికందుల సత్యం, టీడీపీ కళ్యాడపు ఆగయ్య, బీఎల్‌ఎఫ్ వసీం అహ్మద్, టీజేఎస్ ముగురం రమేశ్‌లతో పాటు వందమందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు.