కరీంనగర్

సలహాలు ఇవ్వండి..సర్కారు బడికి పంపండి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 22: ‘మా పిల్లలతో పాటు మీ పిల్లలను చేర్పిస్తే మెరుగైన విద్యను అందిస్తాం. విద్యార్థుల ప్రగతికి ప్రతి క్షణం పాటు పడుతున్నాం. ప్రభుత్వ పాఠశాల అంటే చదువు చెప్పని ఉపాధ్యాయులుంటారనే భావనకు మేం తెర తీస్తున్నాం. నిష్ణతులైన ఉపాధ్యాయ బృందం మాది. శిక్షణ పొందని ఉపాధ్యాయులతో ప్రైవేటు బడుల్లో చదువులు చెప్పిస్తున్నారు. సలహాలు ఇవ్వండి.. సర్కారు బడికి పంపండి..’ అంటూ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం వినూత్న ప్రచారం నిర్వహించారు. నారాయణపూర్‌లో ఇంటింటా తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రైవేటు, ప్రభుత్వ బడుల్లోని సదుపాయాలను వివరించారు. వేలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలలకు పంపితే ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. సర్కారు బడుల్లో చదివిన పూర్వ విద్యార్థుల ప్రగతిని విద్యార్థుల తల్లిదండ్రుల ముందు ఉంచారు. ఉపాధ్యాయుల బోధనలో లోపాలు ఉంటే చెప్పాలని విన్నవిస్తూ గ్రామంలో కర పత్రాలను అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దేవిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.