కరీంనగర్

ఘాటెక్కిన ఎండు మిర్చి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాలరూరల్, ఏప్రిల్ 28: వర్షాభావ పరిస్థితుల కారణంగా నిత్యవసర సరుకుల ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. నీటి సౌలభ్యం కలిగిన రైతులకే తక్కువ స్థాయి ఉత్పత్తులు చేతికి రావడంతో దినుసులను అధిక ధరకు విక్రయిస్తున్నారు. చింతపండు, పసుపు, ఎండుమిర్చి, వెల్లుల్లి కొనుగోలు జగిత్యాల వారసంత ప్రసిద్దిగాంచింది. అయితే పచ్చళ్ల సీజన్ కావడంతో గురువారం స్థానిక వారసంత వినియోగదారుల సందడి తీవ్రంగా కనిపించింది. వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని చింతపండు మినహా ఎండుమిర్చి, పసుపు, వెల్లుల్లి, ఉల్లి, ఆవాలు, వేరు శనగ తదితర నాణ్యమైన దినుసులను వారసంతకు తరలించి విక్రయిస్తారు. కొందరు వర్తకులు రైతుల వద్ద కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తుండగా, మరికొందరు శీతల గిడ్డంగిలో నిల్వ చేసి కొంత కాలానికి విక్రయిస్తారు. సాధారణ ఎండు మిర్చి కిలో రూ. 160 చింతపండు కిలో రూ 100, పసుపు కొమ్ము కిలో రూ 80 నుండి 90 విక్రయించగా, వెల్లుల్లి కిలో రూ 80 నుండి 90 ధర పలికుతుంది. అయితే తక్కువ స్థాయిలో ఉత్పత్తులు చేతికి రావడం వల్ల వినియోగదారులు దినుసుల నాణ్యత పరిశీలించి అధిక ధరలతోను కొనుగోలు చేయడం గమన్హారం.