కరీంనగర్

రెండ్రోజులుగా ప్రభుత్వాసుపత్రిలో ‘నో’ కరెంట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 28: అసలే వేసవికాలం.. అందులోనూ దంచికొడుతున్న ఎండలు. ఈ క్రమంలో కరెంట్ సరఫరా లేకపోతే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కావడం తప్ప ఇంకేముండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో రెండు రోజులుగా కరెంట్ సరఫరా నిలిచిపోతే, అందులో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఈ పరిస్థితులు చోటుచేసుకోవడం గమనార్హం. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో మంగళవారం సాయంత్రం గాలి దుమారం, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించిన సంఘటనలో ప్రభుత్వ ప్రధానాసుపత్రి ఎదుట, ఆవరణలో పలు చెట్లు, ఎడెనిమిది దాకా విద్యుత్ స్తంభాలు పడిపోయి, వైర్లు తెగిపోయి కరెంట్ నిలిచిపోయిన సంగతి అందరికి తెలిసిందే. అప్పటి నుంచి (మంగళవారం సాయంత్రం) నుంచి గురువారం సాయంత్రం వరకు కూడా ఆసుపత్రి విద్యుత్ సరఫరాకు నోచుకోలేదు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు మాత్రం రెండ్రోజులుగా అనేక అవస్థలు పడుతున్నారు. ఓ వైపు రోగంతోనే బాధపడుతుంటే, మరోవైపు ఈ ఉక్కపోత కష్టాలెందిరా బాబోయ్ అంటూ రోగులు వాపోతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో 350 మంది దాకా రోగులు చికిత్స పొందుతుండగా, అత్యవసర కేసులతోపాటు ఐసియు, లేబర్ రూం తదితర వాటికి జనరేటర్ సహాయంతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. జనరల్ వార్డులకు మాత్రం ఈ సౌకర్యం అందడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండంతో మధ్యాహ్నం సమయాల్లో జనరల్ వార్డు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లల వార్డులో ఉన్న చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. రాత్రి వేళల్లో మాత్రం జనరేటర్ సహాయంతో ఫ్యాన్లు లేకుండా కేవలం లైట్లు మాత్రమే వేస్తున్నారు. రెండ్రోజులుగా విద్యుత్ అధికారులు, సిబ్బంది కరెంట్ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నా.. విద్యుత్ సరఫరాలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది. కరెంట్ సరఫరాలో జరుగుతున్న జాప్యంపై రోగులు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ‘బాస్’లు కొలువుండే జిల్లా కేంద్రంలోనే, అందులో ప్రభుత్వాసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితులుంటే.. ఇక వేరే ప్రాంతాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చంటూ రోగులు విస్తుపోతున్నారు. కరెంట్ లేకపోవడంతో ఉక్కపోతతో సతమతమవుతున్నామని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన రఘుపతిరెడ్డి, గోదావరిఖనికి చెందిన ఎడ్ల శ్రీరాములు, కరీంనగర్ మండలం ఎలగందులకు చెందిన జయలక్ష్మి, చందుర్తి మండలానికి తాళ్లపల్లి రాజేశ్వరిలు తెలిపారు. వర్షం బీభత్సం సృష్టించిన మంగళవారం నాడు సైతం కరెంట్ సరఫరా లేక ఆరు గంటలకుపైగా నగరం అంధకారంలో మగ్గిన విషయం అందరికి తెలిసిందే. ఆసుపత్రిలో కరెంట్ పునరుద్ధరణలో జాప్యం జరుగుతుండటంపై విద్యుత్ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం, లేదా రాత్రి వరకు కరెంట్ సరఫరా అవుతుందని విద్యుత్ అధికారులు తెలిపినట్లు డిసిహెచ్‌ఎస్ డాక్టర్ అశోక్‌కుమార్ ‘ఆంధ్రభూమి’తో తెలిపారు. ఏదిఏమైనా కరెంట్ సరఫరా లేకపోవడంతో జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు మాత్రం నానా కష్టాలు పడుతూ అల్లాడిపోతున్నారు.